అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కోవాలంటే…. ఇలా చేయండి చాలు!

hand-holding-blood-glucose-meter-measuring-blood-sugar-background-is-stethoscope-chart-file-2-972x625

జీవన విధానంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ రోజుల్లో చాలా మంది ఏదో రకమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రధానంగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే వారి సంఖ్య ప్రమాదకరస్థాయిలో ఉండడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధిక రక్తపోటు సమస్యకు కారణాలు ఏవైనా కావచ్చు దీని ఫలితంగా మన శరీరంలో ప్రధాన అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, లివర్, మెదడు వంటి అవయవాల పనితీరుపై తీవ్రప్రభావాన్ని చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రమాదకర రక్తపోటు సమస్య నుంచి భవిష్యత్తులో రక్షణ పొందాలంటే మన నిత్య జీవన విధానంలో సమూలమైన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉప్పు ,కారం, ఫాస్ట్ ఫుడ్, అధిక కొలెస్ట్రాల్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. దాంతోపాటు అధిక రక్తపోటు సమస్యను నియంత్రించే కొన్ని ఆహార పదార్థాలను తరచూ మన డైట్ లో ఉండునట్లు చూసుకోవాలి. నిపుణుల సూచనల ప్రకారం ప్రతిరోజు ఒక అరటి పండును ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా లభించే పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషక పదార్థాలు రక్తప్రసరణ వ్యవస్థ లోపాలను సరిచేసి రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించడంతోపాటు హై బీపీ సమస్యను తగ్గిస్తుంది తద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

అధిక రక్తపోటును అదుపు చేయడంలో పుచ్చకాయలోని ఔషధ గుణాలు ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయి.పుచ్చకాయలో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటు ముప్పును త‌గ్గిస్తుంది. పుచ్చ‌కాయ‌ల్లో ఉండే లైకోపీన్‌, విట‌మిన్ ఏ, సీ, అమైనో యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మ‌న శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.ప్రతిరోజు ఆహారంలో టమాటాలను తీసుకుంటే వీటిల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. రోజువారి ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా వినియోగిస్తే ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.