ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన విధానం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి శుభ్రమైన పౌష్టికాహారం తినటం ఎంత అవసరమో పరిశుభ్రమైన నీటిని తాగటం కూడా అంతే అవసరం. సాధారణంగా మనిషి ఒక వారం రోజులపాటు ఆహారం లేకుండా జీవించగలడు కానీ ఒక్కరోజు నీరు తాగకపోతే శరీర డిహైడ్రేట్ అయ్యి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా ప్రాణాపాయస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు మనిషి మూడు లేదా నాలుగు లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నీటిని తక్కువగా తాగటం వల్ల శరీరం డిహైడ్రేషన్ కి గురై అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అయితే నీరు తాగటం ఆరోగ్యానికి అవసరం కదా అని పరిశుభ్రమైన నీటిని తాగకుండా కలుషితమైన నీటిని తాగటం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కలుషితమైన నీటిని తాగటం వల్ల డయేరియా, టైఫాయిడ్ కలరా వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల పరిశుభ్రమైన నీటిని తాగటం చాలా అవసరం. అయితే చాలామంది నీటిని మరిగించడం వల్ల మీరు పరిశుభ్రంగా మారుతుందని అపోహ పడుతుంటారు. ఫ్లోరైడ్ నీటిని తాగటానికి కనీసం 20 నిమిషాలు 60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించాల్సి ఉంటుంది. కానీ మరిగించటం వల్ల నీరు పూర్తిగా శుభ్రంగా ఉందా? అనే అనుమానం అందరిలో ఉంటుంది. నీటిని మరిగించడం వల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది కానీ ఆ నీటిలో ఉండే సీసం, క్లోరిన్ వంటి అనేక రసాయనాలు నీటిలో అలాగే ఉంటాయి.
ఇక ప్రస్తుత కాలంలో అందరూ మినరల్ వాటర్ తాగటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నీటిని ఫిల్టర్ చేయటం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియాతో పాటు సీసం క్లోరిన్ వంటి ప్రమాదకర రసాయనాలు కూడా తొలగిపోతాయి. అందువల్ల మరిగించిన ఫ్లోరైడ్ నీటిని తాగటం కన్నా ఫిల్టర్ చేసిన నీటిని తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం మరిగించిన ఫ్లోరైడ్ వాటర్ కి బదులు ప్రతిరోజు మూడు నుండి నాలుగు లీటర్ల మినరల్ వాటర్ తాగటం చాలా అవసరం.