Health Tips: ఇంగువ తినటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు…!

Health Tips: సాధారణంగా మన భారతీయ ఇంట్లో ఇంగువ తప్పకుండా ఉంటుంది. ఆహార పదార్థాలలో ఇంగువ వేసి ఉండటం వల్ల అద్భుతమైన రుచి సువాసన ఉంటాయి. అయితే మనం తీసుకొనే ఆహారంతో ఇంగువ కలపటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. మన శరీర ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో రకాల పోషకాలు ఇంగువలో పుష్కలంగా ఉంటాయి. ఇంకో వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇంగువలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది తరచుగా వచ్చే సీజనల్ వ్యాధుల ను తగ్గించడమే కాకుండా గజ్జి, దురద, చర్మ వ్యాధులను నయం చేయడంలో ఇంగువ ఉపయోగపడుతుంది.

మనం తినే ఆహారంలో ఇంగువ చేర్చుకోవడం వల్ల శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు తగ్గించడంలో ఉపయోగపడే ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నడుము నొప్పి తలనొప్పి వంటి సమస్యలను నియంత్రించడంలో కూడా ఇంగువ ఎంతో ఉపయోగపడుతుంది.క

అజీర్తి వల్ల ఏర్పడే కడుపునొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గించడంలో ఇంగువ బాగా ఉపయోగపడుతుంది. ఈ సమయంలో, వేడి నీటిలో కలిపిన ఇంగువ పొడిని కలిపి తాగటం వల్ల ఆ సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడేవారు డే గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగటం వల్ల ఆ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. అంతే కాకుండా ఇలా ఇంగువ నీటిని తాగటం వల్ల మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలు,వ్యర్థాలు తొలగిపోతాయి.