Apple Benifits: రోజుకు ఒక యాపిల్ తినండి డాక్టర్ కు దూరంగా ఉండండి అని చాలామంది అనడం వినే ఉంటారు. అనేక మందికి డాక్టర్లు కూడా రోజుకు ఒక ఆపిల్ తినండి అని సలహా ఇస్తుంటారు. అయితే ఉదయాన్నే పరగడుపున ఒక ఆపిల్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆపిల్లో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఉదయాన్నే ఆపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి చదివేయండి.
• యాపిల్ లో ఐరన్, పొటాషియం, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఉదయాన్నే ఆపిల్ ను తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు.
• యాపిల్ లో ఉన్న పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతాయి.
• యాపిల్ లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఉదయాన్నే పరగడుపున యాపిల్ తినడం వల్ల మీకు ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఫలితంగా మీ శరీరం అధిక బరువు ఈ సమస్యతో బాధపడే వారు సులభంగా వారి బరువు తగ్గించుకోవచ్చు.
• యాపిల్ లో ఉండే ఫైబర్ రక్తపోటును నియంత్రిస్తుంది. రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ తినడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
• యాపిల్ ను ఎప్పుడూ పైన తోలు తీసేసి తినటం మంచిది కాదు. యాపిల్ లోపలి భాగానికికన్న పైన ఉన్న తోలు లోనే అధిక మొత్తంలో విటమిన్లు లభిస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో అన్ని పనులను రసాయనిక ఎరువులు వేసే పండించడం వల్ల పండ్లను శుభ్రంగా కడిగి తినడం శ్రేయస్కరం.రోజు పరగడుపున యాపిల్ తినడం వల్ల శరీరంలోని వాపులను తగ్గించడమే కాకుండా మంటను తగ్గిస్తుంది.