Health Tips: వేసవికాలంలో రోజు రోజుకి ఎంత తీవ్రతలు పెరుగుతూనే ఈ ఈ వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీటిని తాగడం చాలా అవసరం. సాధారణంగా తగినంత నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. నిపుణులు తెలిపిన మేరకు రోజుకు ఎనిమిది నుండి పది గ్లాసుల నీటిని తాగడం శ్రేయస్కరం. వేసవిలో శరీరాన్ని వేడికి గురి కాకుండా, డీహైడ్రేట్ కాకుండా కొంతమంది పండ్ల రసాలను తాగడానికి ఇష్టపడతారు, మరికొంతమంది తమకిష్టమైన శీతల పానీయాలను తాగుతారు. అయితే సాధారణ నీటిలో కొన్ని రకాల సహజమైన పదార్థాలు జోడించి, మీరు తాగే నీటిని కూడా ఆరోగ్యవంతం చేసుకోవచ్చు.
పుదీనా, దాల్చిన చెక్క వంటి వాటిని నీటి తో జోడించిన ఫ్లేవర్డ్ వాటర్ తాగడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకోగల శక్తి మీ శరీరానికి లభిస్తుంది. వేసవిలో ఈ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పుదీనా: పుదీనా ఎంతో సువాసన కలిగి ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయగల శక్తి లభిస్తుంది. ఇది తినడం వల్ల శరీరం ఉత్తేజపరచడమే కాకుండా, జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయి.
దాల్చిన చెక్క: మనం రోజు వంటలలో ఉపయోగించే ఈ దినుసు లో అధికమొత్తంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. దీనిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల వడ దెబ్బ తగలకుండా కాపాడుతుంది. దాల్చిన చెక్క తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి తరచుగా వ్యాధుల బారిన పడకుండా నిరోధిస్తుంది.
నిమ్మకాయ: నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. నిమ్మకాయ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. రోజు తాగే నీటిలో నిమ్మకాయ పిండుకొని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది.
ఫ్లేవర్డ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి?
నీరు ఉన్న ఒక వాటర్ బాటిల్ తీసుకొని, అందులోకి కొన్ని తాజా పుదీనా ఆకులు, దాల్చిన చెక్క, కాస్త నిమ్మకాయ పిండుకొని షేక్ చేయాలి.దాహం వేసినప్పుడు ఈ నీటిని తాగడం వల్ల ఎండ తాపం నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ నీరు మంచి సువాసనతో రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది.