ఇండస్ట్రీలోకి రాకముందు దాసరి ఎలాంటి పని చేసేవారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించుకున్న డాక్టర్ దాసరి నారాయణరావు గురించి అందరికీ సుపరిచితమే.ఈయన తన సినీ కెరీర్లో 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించడమే కాకుండా ఎన్నో సినిమాలకు నిర్మాతగా, నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇలా బాగా ఉన్నత కుటుంబంలో జన్మించిన దాసరినారాయణరావు ముగ్గురు పిల్లలు వీరిలో చిన్నవాడైన దాసరి మాత్రమే చదువుకుంటూ ఉండేవారు.దాసరి నారాయణ రావు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామంలో జన్మించారు. అయితే ఈయన తండ్రి పెదనాన్న కలిసి వ్యాపారం చేసేవారు.

ఈ విధంగా పొగాకు వ్యాపారం చేస్తున్న సమయంలో ఒక దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కారణంగా పొగాకు గోడౌన్ లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగి భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ నష్టాలను పూడ్చడానికి వీరి ఆస్తిపాస్తులను కూడా అమ్ముకోవలసి వచ్చింది. తద్వారా కుటుంబ పోషణ భారం కావడంతో దాసరి కూడా తన చదువును ఆపి కుటుంబానికి తన వంతు సహాయం చేశారు.

ఈ క్రమంలోనే దాసరి నారాయణరావు చిన్నప్పుడు ఒక వడ్రంగి దగ్గర పనికి చేరారు. అప్పట్లో ఈయన జీతం నెలకు ఒక రూపాయి మాత్రమే.ఇలా ఎంతో ప్రతిభావంతుడైన దాసరి నారాయణరావు మధ్యలోనే చదువు ఆపడంతో ఒక మాస్టర్ సహాయంతో ఈయన తిరిగి తన చదువును కొనసాగించారు. ఈ విధంగా చదువులో ముందుకు సాగిన ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దాసరి తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచారు. ఈ విధంగా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న దాసరి మే 30 2017 లో తుది శ్వాస విడిచారు.