వారానికి ఏడురోజులు. ఆయా రోజులకు ఆయా దేవతలు అధిపతులుగా ఉంటారు. గ్రహాలు అధిపతులు ఉంటారు. కాబట్టి ఆయా దేవతలకు అనుకూలమైన రంగులు ఆ రోజుల్లో ధరిస్తే అనుకూల ఫలితాలు వస్తాయని పూర్వం నుంచి మనదేశంలో ఆచారం ఉంది. ఆ విశేషాలు తెలుసుకుందాం…
సోమవారం – తెల్లని దుస్తులు ధరిస్తే మంచిది అంటారు. నీలి రంగు దుస్తులు కూడా ధరించవచ్చు. మంగళవారం రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. మంగళవారం కుజగ్రహం అధిపతి. ఈరోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఇక బుధవారం బుధగ్రహానికి సంబంధించినది. ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. గురువారం రోజు రోజు విష్ణువుకు అంకితం. పసుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించాలి.
శుక్రవారం రోజు ఈ రోజు తెలుపు దుస్తులు ధరించాలి. దీనికి కారణం శుక్రగ్రహం తెలుపు అంటే ఇష్టం. శనివారం శనిదేవుడి వారం. ఈ రోజు తప్పకుండా నలుపు రంగు దుస్తులు ధరించాలి. శనిదేవుడికి నలుపు అంటే ఇష్టం. నలుపు లేదా పర్పల్ రంగు దుస్తులు ధరించాలి. ఆదివారం రోజు పసుపు రంగు దుస్తులు ధరించాలి. అదివారం సూర్యుడికి అంకితం.
ఇలా ఆయా రోజుల్లో ఆయా రంగుల దుస్తులు ధరిస్తే కంటికి, వంటికి మంచిదని పెద్దల అభిప్రాయం. ఇష్టముంటే, అవకాశం ఉంటే ధరించండి.