Bolly Wood Celebrities: బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ వివాహం గురించి పెద్ద ఎత్తున వార్తలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరు పెళ్లి గురించి పెళ్లిలో ఈమె ధరించిన దుస్తులు నగల గురించి చర్చనీయాంశంగా మారింది. ఇలా ఎంతో అంగరంగ వైభవంగా కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ డిసెంబర్ 9 వ తేదీ
రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వీరు పెళ్లి పీటలను ఎక్కారు.కత్రినా కైఫ్ ఈ పెళ్లి వేడుకలో డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన ఎరుపు రంగు లెహంగాలో కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది. ఈ లెహంగా దాదాపు 17 లక్షల విలువ చేస్తుందని అలాగే నిశ్చితార్థం లో కత్రినా ధరించిన డైమండ్ రింగ్ కూడా 7.4 లక్షలంటూ బిటౌన్లో గుసగుసలు వినపడుతున్నాయి.
ఈ క్రమంలోనే మరికొంత మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు వారిలో వేసుకున్న నగలు ధర ఎంతో ఓ లుక్కేద్దాం…
ఐశ్వర్యరాయ్ : బిగ్ బీ కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ తన పెళ్లి అప్పట్లో పెద్దఎత్తున వార్తల్లో నిలిచింది. ఐశ్వర్యరాయ్ బంగారుతీగలతో తయారు చేసిన చీరను తన పెళ్లిలో కట్టుకున్నారు ఈ చీర 75 లక్షల విలువ చేస్తుందని అలాగే ఆమె ధరించిన నగలు దాదాపు మూడు కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది.
అనుష్క శర్మ: క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ తన పెళ్లి కోసం డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన లెహంగా 45 లక్షలు పెళ్లి కోసమే ఉపయోగించిన నగలు విలువ దాదాపు మూడు కోట్లు.
ప్రియాంక చోప్రా: ఈ ముద్దుగుమ్మ అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహం చేసుకున్నారు. ఈమె పెళ్లి సమయంలో సుమారు నాలుగు కోట్ల విలువ చేసే నగలను ధరించారు.
దీపికా పదుకొనే: ఈమె నటుడు రణవీర్ సింగ్ వివాహం చేసుకున్నారు. ఈమె వివాహానికి 20 లక్షల విలువ చేసే మంగళ సూత్రం ధరించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
శిల్పా శెట్టి: ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న శిల్పాశెట్టి ఈమె పెళ్లిలో 50 లక్షల విలువచేసే లెహంగా 3 కోట్ల విలువ చేసే నగలను ధరించారు.