Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో రాజమౌళి ఒకరు. ఈయన ఇప్పటివరకు సుమారు 12 సినిమాలు వరకు దర్శకత్వం వహించారు. అయితే ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదని చెప్పాలి. ఇలా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.
ఇక బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఇక బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి కూడా తన సినిమాలన్నింటినీ కూడా పాన్ ఇండియా స్థాయిలో దృష్టి పెట్టుకొని చేస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR సినిమా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతో ఆస్కార్ అవార్డు అందుకుంది.
ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో మరో సినిమా చేయబోతున్నారు ఈ సినిమా కూడా పాన్ వరల్డ్ స్థాయిలో అంచనాలను పెంచేస్తోంది ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ అవ్వడానికి ప్లాప్ కాకుండా ఉండడానికి కారణమేంటి అసలు జక్కన్న సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అందరూ ఆరాధిస్తూ ఉంటారు.
చాలామంది డైరెక్టర్లు హిట్ ప్లాపులను చవిచూస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం సక్సెస్ రేట్ పెంచుకుంటూపోతున్నారు. అలా తన సక్సెస్ అవ్వడానికి కారణం ప్రతి ఒక్క సన్నివేశం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటికి పది సార్లు షూటింగ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా తన సినిమా షూటింగ్లో పాల్గొనే సమయంలో చిత్రం బృందం తప్పనిసరిగా రాజమౌళి చెప్పే రూల్స్ పాటించాల్సిందే.రాజమౌళి ఎవరికోసం కాంప్రమైజ్ కాడు అని.. ఆయన చెప్పిందే వేదం ఈ కారణాలే రాజమౌళి సినిమాలు సక్సెస్ అవ్వటానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు.