Satyanarayana Vratham: మన హిందు సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల పూజలు, వ్రతాలు ఆచరిస్తాము. ఈ విధంగా చాలామంది ప్రతి ఏడాది సత్యనారాయణ వ్రతం చేయించడం లేదా గృహప్రవేశ సమయంలో సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ గృహప్రవేశానికి చేస్తుంటారు.అలాగే పెళ్లయిన కొత్త దంపతుల చేత ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారి దాంపత్య జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు ఉండవని భావిస్తారు. ఇలా ఎంతో పద్ధతిగా భక్తితో చేసే సత్యనారాయణ వ్రతం ఎప్పుడైనా చేయవచ్చా ? సత్యనారాయణ వ్రతాన్ని చేయడానికి కూడా ఏవైనా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
పురాణాల ప్రకారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సత్యనారాయణస్వామి వ్రతాన్ని నారదుడికి వినిపించి ఈ పూజ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ప్రజలు వారి కష్టాల నుంచి బయట పడటానికి ఈ వ్రతం విశేషమైన ఫలితాలను అందిస్తుంది. ఇకపోతే ప్రతి ఒక్కరు సత్యనారాయణ వ్రతాన్ని చేసే స్తోమత ఉండదు అలాంటివారు సత్యనారాయణ స్వామి పుస్తకాన్ని చదివిన మంచి ఫలితాలు అందుతాయి. ఇలా ఎంతో విశిష్టమైన ఈ వ్రతాన్ని చేయటానికి ఎంతో అనువైన రోజు పౌర్ణమి అని చెప్పాలి.
పౌర్ణమి రోజు సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేయడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు.అమావాస్య, అష్టమి, ద్వాదశి, సంక్రాంతి, దీపావళి, ఆదివారం, సోమవారం, శుక్రవారం, శనివారాల్లో చేయించుకోవచ్చు. పౌర్ణమి రోజు ఈ వ్రతాన్ని చేయడం ఎంతో మంచిది. ఎందుకంటే పౌర్ణమి చంద్రుడు రోజు కనుక ఈ రోజు సత్యనారాయణ వ్రతానికి విశేష ఫలితం ఉంటుంది. అలాగే ఆ మహావిష్ణువు ఆశీస్సులు మనపై ఉండి కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు. అందుకే సత్యనారాయణస్వామి వ్రతాన్ని పౌర్ణమి రోజు ఆచరించడం ఎంతో ముఖ్యం.
