Thaman First Remuneration: సంగీత దర్శకుడు తమన్ మొదటి సంపాదన ఎంతో తెలుసా?

Thaman First Remuneration: ఎస్.ఎస్.తమన్ ప్రస్తుతం సంగీత దర్శకుడిగా అరడజనుకు పైగా సినిమాలను చేతిలో పెట్టుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే తమన్ తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు సంగీతం అందించిన విషయం మనకు తెలిసిందే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే బుల్లితెర ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తమన్ మాట్లాడుతూ..తాను కేవలం ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని ఆరవ తరగతి చదువుతున్న సమయంలో తన తండ్రి చనిపోవడంతో చదువు పై ఏమాత్రం శ్రద్ధ లేకపోవటం వల్ల పూర్తిగా చదువును పక్కన పెట్టానని తెలిపారు. ఇక తన తండ్రి మరణించిన తర్వాత తన పేరు పై ఉన్న ఎల్ఐసి డబ్బులు 60 వేలు వచ్చాయి. ఆ డబ్బులతో తన తల్లి తనకు డ్రమ్స్ కోనిచ్చిందని అలా సంగీతం వైపు నా అడుగులు పడ్డాయని తెలిపారు.

డ్రమ్స్ నేర్చుకున్న తర్వాత మొదటిగా తాను బాలకృష్ణ నటించిన భైరవద్వీపం సినిమా కోసం పని చేశానని తెలిపారు. ఈ సినిమా కోసం పనిచేసిన సమయంలో తనకు 30 రూపాయల పారితోషికం అందించారని ఈ కార్యక్రమంలో తమన్ తన మొదటి సంపాదన గురించి తెలియజేశారు. అలా 30 రూపాయలతో ప్రారంభమైన తన ప్రస్థానం నేడు ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవడం విశేషం.