Lord Shiva: పరమ శివుని హర హర మహాదేవ అని పూజించడం వెనుక దాగి ఉన్న అర్థం ఏంటో తెలుసా?

Lord Shiva: సాధారణంగా మనం ఏదైనా శివాలయాలకు వెళ్ళినప్పుడు ఎంతో మంది భక్తులు స్వామిని వివిధ రకాలుగా పూజించడం చూస్తుంటాము. ఈ క్రమంలోనే చాలామంది పరమేశ్వరుడిని పూజిస్తున్న సమయంలో హర హర మహాదేవ అనే మంత్రం జపిస్తూ పూజిస్తూ ఉంటారు.ఈ విధంగా పరమేశ్వరుడిని హర హర మహాదేవ అని పిలవడం వెనుక దాగి ఉన్న అర్థం ఏమిటి? అలా పరమేశ్వరుడిని ఎందుకు పిలుస్తారు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం హరహరమహదేవ అంటే హర అంటే పాపాలన్నింటినీ హర అంటే తీసుకువెళ్లే వాడు మహాదేవ దేవుళ్ళకే దేవుడు అని అర్థం.హర హర మహాదేవ అంటే సాక్షాత్తు దేవుళ్ళకే దేవుడు అయినటువంటి పరమేశ్వరుడు మనలో ఉన్న పాపాలనే అన్నింటిని తీసుకెళ్తాడని అర్థం వస్తుంది కనుక పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళిన భక్తులు అందరూ కూడా ఈ విధమైనటువంటి మంత్రాన్ని పలుకుతూ స్వామి వారిని పూజిస్తారు.

ఇలా పూజించడంతో వారి పాపాలు మొత్తం తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. ముఖ్యంగా పరమేశ్వరుడిని హరహరమహదేవ అంటూ కాశీ వీధులలో పెద్ద ఎత్తున ఈ మంత్రాన్ని చదువుతూ స్వామివారి పూజిస్తూ ఉంటారు. ఇక మరికొన్ని ప్రాంతాలలో శివయ్య, ఈశ్వరుడిగా కూడా భక్తులు పూజిస్తుంటారు.