పాలిచ్చే తల్లులు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో తెలుసా?

 

ప్రసవం తర్వాత పిల్లలకు పాలిచ్చే తల్లులు వారు తీసుకొని ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. పిల్లలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పాలిచ్చే తల్లులు ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే పిల్లల ఆరోగ్యం సమస్యలలో పడే అవకాశం ఉంటుంది. పాలిచ్చే తల్లులు ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పాలిచ్చే తల్లులు ఎటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అందరికి ప్రతి రోజు కాఫీ, టీ తాగటం అలవాటు ఉంటుంది. కానీ ప్రసవం తర్వాత పిల్లలకు పాలిచ్చే మహిళలు కాఫీ టీ ఎక్కువగా తాగటం వల్ల అందులో ఉండే కెఫిన్ పిల్లలు ఎక్కువ సమయం నిద్రపోయేలా చేస్తుంది. అందువల్ల పిల్లలు ఆక్టివ్ గా ఉండరు. దీంతో పాలిచ్చే తల్లులు కాఫీ, టీ లకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు కూడా తల్లులు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో కోలిక్ వంటి ప్రమాదకరమైన ఎన్నో రసాయనాలుంటాయి. ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తినటం వల్ల పిల్లల్లో అలర్జీ సమస్యలు తలెత్తుతాయి.

పసి పిల్లలకు పాలిచ్చే తల్లులు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. పాలు పాల ఉత్పత్తులతో తయారుచేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా పిల్లల్లో చర్మ సంబంధిత వ్యాధులు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా పాలిచ్చే తల్లిదండ్రులు ఎక్కువ కారం ఉన్న ఆహార పదార్థాలను పొరపాటున కూడా తినకూడదు. ఇలా ఎక్కువ కారం ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల దాని ప్రభావం పిల్లల జీర్ణ వ్యవస్థపై పడుతుంది. అంతేకాకుండా కడుపులో గ్యాస్ పొయ్యి ఆహార పదార్థాలకు తల్లులు దూరంగా ఉండటం మంచిది. ఇటువంటి ఆహార పదార్థాలను తినటం వల్ల చిన్న పిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.