Gallery

Home News దుబ్బాక ఓటమి కేసీఆర్ కేటీఆర్ కు ముందే తెలుసా..? అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా..?

దుబ్బాక ఓటమి కేసీఆర్ కేటీఆర్ కు ముందే తెలుసా..? అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా..?

 దుబ్బాకలో తెరాస కు ఊహించలేని షాక్ తగిలింది. విజయం ఖాయమని భావించిన చోట తెరాస పార్టీకి ఓటమి ఎదురుకావటం నిజంగా షాక్ కు గురిచేసే విషయమనే చెప్పుకోవాలి. దుబ్బాక నామినేషన్ వేసిన తర్వాత తెరాస విజయం మీద ఎవరికీ పెద్ద అనుమానాలు కూడా లేవు, కానీ ఎన్నికలు దగ్గరకి వచ్చేకొద్దీ పోటీ రసవత్తరంగా మారిపోయింది. బీజేపీ నుండి రఘునందన్ రావు దూసుకొచ్చాడు. అయితే అయన మీద బీజేపీ వాళ్ళకే నమ్మకం సరిగ్గా లేదు. ఇక కాంగ్రెస్ నేతలు కూడా రఘునందన్ రావు విషయంలో లైట్ తీసుకున్నారు, కానీ తెరాస లో ఇద్దరు మాత్రం రఘునందన్ రావు ను తక్కువగా అంచనా వేయలేదు.. అతని వలన తమకు ఇబ్బందులు తప్పవని గ్రహించారు. ఆ ఇద్దరే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.

Ktr Kcr

 నిజానికి దుబ్బాక ఎన్నికల బాధ్యత హరీష్ రావు తీసుకున్న కానీ, తెరవెనుక కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కూడా దుబ్బాక మీద ప్రత్యేక శ్రద్ద చూపించారు. దుబ్బాక అటు హరీష్ రావు సిద్దిపేట కు ఇటు కేటీఆర్ సిరిసిల్ల కు, మరో పక్క సీఎం కేసీఆర్ గజ్వాల్ నియోజకవర్గాల మధ్యలో ఉంటుంది. దీనితో దుబ్బాక గెలుపు బాధ్యత ఈ ముగ్గురుకి కూడా ఉంది. ఇక మొదటి నుండి రఘునందన్ సత్తా ఏమిటో తెలిసిన కేసీఆర్ డైరెక్ట్ గా దుబ్బాక పోరులో తలదూర్చకపోయిన కానీ, దుబ్బాక కి చుట్టపక్కల రెండు బహిరంగ సమావేశాలు నిర్వహించాడు. అందులో ముఖ్యంగా దుబ్బాక ఎన్నికల గురించే ప్రస్తావించాడు, ఒక దశలో రాజీనామా చేస్తానని కూడా మాట్లాడాడు కేసీఆర్.

 అదే సమయంలో కేటీఆర్ కూడా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి మరి బీజేపీ రాష్ట్రంలో అల్లర్లు చేయటానికి సిద్ధమైందని ఆరోపణలు చేస్తూ డీజేపీ కి ఫిర్యాదు చేసేదాకా వెళ్లారు. ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనలు. దీనిని బట్టి చూస్తే దుబ్బాక ఎన్నికలను తెరాస పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు. పైకి మాత్రం కేసీఆర్ కేటీఆర్ దుబ్బాకలో ప్రచారం చేయలేదనే పేరు తప్ప, తమ స్థాయికి తగ్గ పనులులన్నీ తెరవెనుక ఉండే చేశారు.

 ఆ ఇద్దరికీ కూడా తెలుసు ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిస్తే ఆ కిక్ ఎలాంటి శక్తిని ఇస్తుందో, తెలంగాణ లో తెరాస పార్టీ బలపడటానికి ప్రధాన కారణం ఇలాంటి ఉప ఎన్నికలే.. తెరాస కు ఒకప్పుడు ఉప ఎన్నికల పార్టీ అనే పేరు కూడా ఉండేది. అవన్నీ తెలుసు కాబట్టే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవకూడదని తెరాస గట్టి ప్రయత్నాలే చేశాయి , కానీ ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు.

- Advertisement -

Related Posts

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే...

China Spy: భారత్ లో చైనా గూఢచారి..! విచారణలో కలకలం రేపే అంశాలు..

China Spy: ఈనెల రెండో వారంలో బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం మాల్దా వద్ద ‘హాన్ జున్వే’ అనే చైనా గూఢచారి అరెస్టయిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా అతను వెల్లడిస్తున్న విషయాలు కలకలం...

ప్రచారం సరిపోదు.. నేరస్తులపై సీరియస్ ‘యాక్షన్’ వుండాల్సిందే

ఆంధ్రపదేశ్ రాజధాని (వైఎస్ జగన్ ప్రభుత్వం అంగీకరించినా అంగీకరించకపోయినా) అమరావతి పరిధిలో అత్యంత హేయమైన ఘటన జరిగింది. ఓ యువతిపై, ఆమెకు కాబోయే భర్త సమక్షంలోనే లైంగిక దాడి జరిగింది. అదీ, అమరావతిలో.....

Latest News