పెళ్లి కోసం నయనతార ధరించిన చీర ఖరీదు ఎన్ని లక్షలో తెలుసా?

నయనతార గత కొద్ది రోజుల నుంచి ఈ పేరు సోషల్ మీడియా వార్తల్లో తెగ మార్మోగిపోతోంది. ఈ విధంగా ఈమె పేరు వినిపించడానికి కారణం ఈమె వివాహమే అని చెప్పాలి. నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు నేడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే ఈమె పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే తాజాగా నయనతార పెళ్లి కోసం ధరించిన చీర గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

పెళ్లిలో నయనతార ఎంతో ఖరీదైన విలువైన నగలను ధరించారని ఈ నగలు అన్నింటిని కూడా తన ప్రియుడు విగ్నేష్ తనకు పెళ్లికి కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. దాదాపు 5 కోట్ల రూపాయల విలువ చేసే నగలను ధరించిన నయనతార పెళ్లి కోసం ప్రత్యేకంగా గద్వాల్ పట్టు చీర డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బంగారు తీగలతో ఈమె తన పెళ్లి చీర డిజైన్ చేయించుకున్నారట. ఈ చీర కోసం నయనతార ఏకంగా ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇన్ని రోజులు పెళ్లి విషయాన్ని సస్పెన్స్ పెట్టిన నయనతార ఎంతో ఘనంగా తన ప్రియుడితో తన వివాహాన్ని జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే ఈమె పెళ్లికి ధరించిన నగలు ఆమె చీర ఖరీదు తెలిసే అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇకపోతే ఇప్పటి వరకు వీరి పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు వీడియోలు కానీ బయటకు రాలేదు తాజాగా విగ్నేష్ నయనతారతో పాటు కలిసి ఉన్న పెళ్లి ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన ఎంతో మంది నెటిజన్లు పెద్దఎత్తున ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే 11వ తేదీ వీరి వివాహ రిసెప్షన్ చెన్నైలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.