Urvashi rautela: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మోడల్ గా తన కెరియర్ ను ప్రారంభించిన అనంతరం హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయారు.ఈ క్రమంలోనే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఊర్వశి నిత్యం ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా ఈ ముద్దుగుమ్మ 2021 మిస్ యూనివర్స్ అందాల పోటీలకు ఇజ్రాయిల్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఈ పోటీలలో ఊర్వశి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.ఇలా ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా వ్యవహరించడం అందుకు ఈమెకు భారీ మొత్తంలోనే పారితోషికం అందించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఊర్వశి రౌతేలాకి 1.2 మిలియన్ల డాలర్లు పారితోషికంగా అందించారు. అంటే మన భారత దేశపు కరెన్సీ ప్రకారం సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విధంగా మిస్ యూనివర్స్ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈమె సినిమాల విషయంలోనే కాకుండా ఈమె వస్త్రధారణ విషయంలో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు.ఇక ఈ పోటీల నుంచి తిరిగి ఇండియా వస్తున్న సమయంలో ఈమె గులాబి రంగు ఫ్రాక్ ధరించి ఉంది. అయితే ఈ డ్రెస్ వజ్రాలతో పొదిగిన ఉండడంతో మరోసారి ఈమె వార్తల్లో నిలిచారు ఈ క్రమంలోనే ఈ డ్రెస్ కు సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.