Shanmukh Jaswanth: బిగ్ బాస్ ద్వారా షణ్ముఖ్ జస్వంత్ ఎంత సంపాదించాడో తెలుసా?

Shanmukh Jaswanth: యూట్యూబర్ గా ఎన్నో వెబ్ సిరీస్,వీడియో సాంగ్స్ ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ దక్కించుకుని దూసుకుపోతున్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టారు. ఈయన బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వగానే ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ టైటిల్ షణ్ముఖ్ జస్వంత్ గెలుస్తారని భావించారు. హౌస్ లోకి వెళ్ళిన కొన్ని వారాలపాటు ఎంతో సైలెంట్ గా ఉన్న షణ్ముఖ్ ఆ తర్వాత సిరి, జెస్సీతో స్నేహం చేశారు.

ఇలా ఈ ముగ్గురు ఎప్పుడు మోజ్ రూమ్ కి పరిమితమై, ఆట పై శ్రద్ధ చూపకపోవడమే కాకుండా సిరితో కలిసి షణ్ముఖ చేసిన రొమాన్స్ అతనిని బిగ్ బాస్ ట్రోఫీకి దూరం చేసిందని చెప్పాలి. ఇలా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ట్రోఫీ షన్ను కాకుండా సన్నీ అందుకున్నారు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ జస్వంత్ రన్నర్ గా నిలిచారు. ఇక రన్నర్ గా హౌస్ నుంచి బయటకు వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ నుంచి ఎంత సంపాదించారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులతో షణ్ముఖ్ జస్వంత్ ముందుగా చేసుకున్న డీలింగ్ ప్రకారం ఈయన వారానికి ఐదు లక్షల రూపాయలను తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే 15 వారాల పాటు హౌస్ లో కొనసాగినందుకు షణ్ముఖ్ జస్వంత్ సుమారు 65 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. యాంకర్ రవి తర్వాత బిగ్ బాస్ నుంచి అధిక మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న వారిలో షణ్ముఖ్ ఉండటం విశేషం.