Vennela Kishore: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక తెలుగులో ఎంతో మంది కమెడియన్ లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఒక్కొక్కరూ తమదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునీ ఏర్పరచుకున్నారు. ఇక అలాంటి వారిలో కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఒకరు. వెన్నెల కిషోర్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి నుంచి చిన్న చిన్న హీరోల వరకూ అందరికీ ఫేవరెట్ కమెడియన్ గా మారిపోయాడు.
అంతే కాకుండా టాలీవుడ్ లీడింగ్ లో ఉన్న కమెడియన్ కూడా ఇతనే. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఏడాదికి దాదాపు 25 సినిమాలలో నటిస్తున్నాడు. అంతేకాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ అదే రేంజ్ లో సంపాదిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఈ మధ్యకాలంలో వెన్నెల కిషోర్ ప్రతి ఒక సినిమాలో నటిస్తున్నాడు. సినిమా సినిమాకీ తను అంటే ఏంటో నిరూపించుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలోనే మొదట సినిమాలలో నటించినందుకు రోజు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వెన్నెల కిషోర్. ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా నటిస్తుండటంతో, అదేవిధంగా తన క్రేజ్ కూడా పెరిగిపోవడంతో ఒక సినిమాకు రోజుకు రెండు నుంచి మూడు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇక టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కమెడియన్ బ్రహ్మానందం. బ్రహ్మానందం రోజుకి ఐదు లక్షల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక వెన్నెల కిషోర్ కూడా రోజురోజుకీ తన క్రేజ్ ను పెంచుకుంటూ రెమ్యూనరేషన్ విషయంలో బ్రహ్మానందం స్థాయికి చేరుకుంటాడు అన్న వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
