Health Tips: మనం తీసుకునే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మంచి పౌష్టికహారం తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు దరచేరకుండా ఉంటాయి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినటం వల్ల ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలలో బచ్చలి కూర ఒకటి. బచ్చలి కూర లో ఉన్న అనేక రకాల పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రతిరోజు బచ్చలి కూర తినటం వల్ల ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. బచ్చలి కూర వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా.
బచ్చలి కూర లో ఐరన్, క్యాల్షియం ,పొటాషియం, మెగ్నీషియం ,విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతకాలంలో అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్యలలో కిడ్నీలో రాళ్ల సమస్య. చిన్నా పెద్దా అని వయసు వ్యత్యాసం లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తోంది ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో బచ్చలి కూర తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరిగి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది.
బచ్చలి కూర లో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఏదో ఒక విధంగా గా ప్రతిరోజు బచ్చలి కూర తినడం వల్ల రక్తహీనత సమస్యను అదుపు చేస్తుంది. బచ్చలి కూర లో విటమిన్ సి విటమిన్-ఇ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది. బచ్చలి కూర లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ అధిక మొత్తంలో ఉండటంవల్ల కంటి చూపు సమస్యలు కూడా నియంత్రించవచ్చు.
బచ్చలి కూర లో క్యాల్షియం పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల తరచూ ఏదో ఒక రూపంలో మనం తీసుకునే ఆహారంలో బచ్చలికూర కలిపి తీసుకోవడం వల్ల ఎముకలకు కావలసిన పోషణను అందించి ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి. క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నేను నియంత్రించడంలో బచ్చలి కూర ఉపయోగపడుతుంది. బచ్చలి కూరను వంటలు చేసుకుని తినడం, జ్యూస్ తయారు చేసుకుని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.