Health Tips: సాధారణంగా వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. డీహైడ్రేషన్ కు గురికాకుండా ఎక్కువ పానీయాలను తాగడం, నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, కీరదోస వంటి పండ్లను ఎక్కువగా తింటుంటారు . కీరదోస వల్ల శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కీరదోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కూడా అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ , ఫేషియల్స్ కి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ కీర దోసకాయలు పరిమితికి మించి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి కాలం వచ్చింది కదా అని అమితంగా కీర దోసకాయలు తినటం వల్ల శరీరంలో అదనపు ద్రవాన్ని బయటికి పంపుతాయి. ఫలితంగా శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది. ముఖ్యంగా రాత్రి భోజనం తిన్న తర్వాత కీర దోసకాయ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద వాటి ప్రభావం చూపుతాయి. రాత్రివేళ ఆహారం తిన్న తర్వాతకీరదోసకాయలో తినటంవల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక మలబద్ధకం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఫలితంగా నిద్రలేమి సమస్య మొదలవుతుంది.
ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కీరదోసకాయ కు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.అమెరికన్ అకాడమీ ఆఫ్ అలెరజిక్ ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దొసకాయ ఎక్కువగా తినటం వల్ల అలెర్జీలను కలిగిస్తుంది.చాలామందికి చర్మ అలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా దోసకాయ తిన్న వెంటనే నీరు తాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు.