Health Tips: ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?

Health Tips: వంటింట్లో ఎక్కువగా కనిపించే కాయగూరల్లో బంగాళదుంప తప్పనిసరిగా ఉంటుంది. చాలామందికి బంగాళదుంప ఫేవరెట్ వెజిటేబుల్. దీనితో చాలామంది వారికి ఎంతో ఇష్టమైన బంగాళదుంప ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే బంగాళాదుంపలను తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అన్ని నష్టాలు ఉన్నాయి. పెద్దలు కూడా బంగాళదుంపను ఎక్కువగా తినవద్దు సమస్యలు వస్తాయి అని చెబుతూ ఉంటారు. మరి బంగాళాదుంపలు ఎక్కువగా తీసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా పొటాటో చిప్స్‌ అంటే చాలా ఇష్టపడతారు. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్లు-ఎ, సి, మెగ్నీషియం, జింక్, ఐరన్ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీనిని సరైన మోతాదులో తీసుకోవాలని వైద్య, ఆరోగ్య నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఇందులోని కార్బొహైడ్రేట్లు, గ్లూకోజ్‌లు, అమైనో ఆమ్లాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని వారు చెబుతున్నారు. బంగాళదుంపలో పలు పోషకాలు ఉంటాయి. అయితే బరువును పెంచే పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని సరైన మోతాదులోన తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేయించిన, అలాగే ఉడికించిన బంగాళాదుంపలను ఎక్కువగా తినకూడదు అని అంటుంటారు.

అలాగే బంగాళదుంపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ, గ్యాస్‌ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే ఈ బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇక రాత్రి భోజనంలో బంగాళదుంపలు అసలు తినకూడదు. ఒకవేళ తిన్నా తక్కువగానే తీసుకోవాలి. అదేవిధంగా మధుమేహం, బీపీ తదితర వ్యాధులతో బాధపడేవారు బంగాళాదుంపలకు దూరంగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఉండే నేచురల్‌ షుగర్‌ శరీరంలోని బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి డయాబెటిక్‌ రోగులు వీటికి దూరంగా ఉండాలి లేదా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.