సాధారణంగా రైలు ప్రయాణాలు చేయటానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రైలులో అత్యవసరంగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి. చాలామంది తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం చాలా సులభతరంగా మారిపోయింది. ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా చాలా సులభంగా తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్‌సైట్ ద్వారా తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీరు తత్కాల్ లో AC క్లాస్ టిక్కెట్ బుక్ చేయటానికి బుకింగ్ విండో ఉదయం 10:00 గంటలకు తెరుచుకుంటుంది. అయితే, నాన్-AC క్లాస్ తత్కాల్ టిక్కెట్లను ఉదయం 11:00 గంటల నుండి బుక్ చేసుకోవచ్చు.తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం సాధారణ టికెట్ ధర కంటే తత్కాల్ టికెట్ కోసం ప్రయాణికులు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది.
వెబ్సైట్ ద్వారా టికెట్ బుకింగ్:
* వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడానికి irctc.co.in అనే వెబ్సైట్లో మీ IRCTC యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
• లాగిన్ అయిన తర్వాత “Book Ticket” పై క్లిక్ చేయండి.
• అక్కడ ఉన్న “తత్కాల్” బుకింగ్ రకాన్ని ఎంచుకుని, సోర్స్ స్టేషన్, గమ్యస్థానం స్టేషన్ మరియు ప్రయాణ తేదీలతో సహా అన్ని వివరాలను అందించాలి.
• ఆ తర్వాత ప్రయాణీకుల వివరాలను నమోదు చేయండి.
• ఆపై, ఛార్జీలు మరియు ఇతర వివరాలను సమీక్షించి, “Proceed to Payment” పై క్లిక్ చేయండి.
• క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI లేదా అందుబాటులో ఉన్న ఇతర ఎంపికలను ఉపయోగించి చెల్లింపు చేయండి.
• మీ బుకింగ్‌ని నిర్ధారించి ఆ తర్వాత ఇ-టికెట్‌ను డౌన్‌లోడ్ చేయవచ్చు.
IRCTC యాప్ ద్వారా టికెట్ బుకింగ్ :
• ఐ ఆర్ సి టి సి యాప్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి ఫోన్‌లో IRCTC యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
• ఆ తర్వాత యాప్‌ని ఓపెన్ చేసి మీ IRCTC అకౌంట్ లో లాగిన్ అవ్వాలి.
• అప్పుడు, “తత్కాల్ బుకింగ్” ఎంపికను ఎంచుకోండి.
• మీరు ప్రయాణం చేయవలసిన రైలు మరియు తేదీని ఎంచుకొని ప్రయాణీకుల వివరాలను పూరించండి.
• అలాగే మీరు ఇష్టపడే సీటు తరగతి మరియు బెర్త్ రకాన్ని ఎంచుకోండి.
• ఆ తర్వాత టిక్కెట్ ధరను సమీక్షించి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్‌తో చెల్లింపు చేయండి.
• చెల్లింపు స్టేటస్ తనిఖీ చేసి, ఆ తర్వాత టికెట్ డౌన్‌లోడ్ చేయండి