Celebrities: మనం ఎక్కడికైనా వెళితే దాహం వేస్తే బిస్లరీ బాటిల్ కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. అత్యవసర పరిస్థితి వస్తే గానీ కొనం. థియేటర్స్, మాల్స్, రైల్వే స్టేషన్ లలో, ఇంకా ఇతర ప్రదేశాలలో లీటర్ నీళ్ల ధర 10 నుంచి 20 రూపాయల మధ్యలో ఉంటుంది. మంచినీళ్లు ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి అవసరం. కానీ మన సెలబ్రిటీలు మాత్రం ఒక లీటర్ వాటర్ కు వేలల్లో ఖర్చు చేస్తారు.
ఇక విషయానికి వస్తే విరాట్ కోహ్లీ వాడే లీటర్ వాటర్ బాటిల్ ధర 600 రూపాయలు అతను తాగే నీటి బ్రాండ్ ఎవియన్. అతను ఏ హోటల్ లో దిగినా ఈ బాటిల్ ఉండాల్సిందే. అలా అతనొక్కడే కాదు. సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు తాగే లీటర్ వాటర్ బాటిల్ ధర కొన్ని వేల లోనే ఉంటుంది.
మరి వాటిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి ? అనే విషయానికి వస్తే కోనా నగరి 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర 27 వేల రూపాయలు ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవే. వీటిని తాగితే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు తగ్గి చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఒత్తిడి దూరం అవుతుంది అని కొందరి నమ్మకం. ఇంతకీ ఆ నీటికి ఆ ప్రత్యేకత ఎలా వచ్చిందంటే హవాయి దగ్గరలోని పసిఫిక్ సముద్ర తీరంలో రెండు వేల అడుగుల లోతు నుంచి తీసిన నీరు. ఇది ప్రత్యేక పద్ధతిలో ఆ నీటిలోనే ఉప్పదనాన్ని పోగొట్టి బాటిళ్ళల్లో నింపుతారు. దాంతోపాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయట.
అందులో మరొకటి బ్లింగ్ హెచ్2ఓ 550 మిల్లీలీటర్ల నీళ్ల ధర 2680 రూపాయలు. సెలబ్రిటీల చేతిలో ఉండే బాటిల్ కూడా ఆకర్షణీయంగా ఉండాల్సిందే. ఎలాగూ ఖరీదైన నీళ్లు కొంటున్నారు. కాబట్టి లీటర్ వాటర్ బాటిల్ ధరను ఏకంగా పెంచేసింది ది బ్లింగ్ హెచ్ 2వో. ఇకపోతే వీన్. 50 మిల్లీ లీటర్ల ఈ బాటిల్ ధర 1500 రూపాయలు. ఈ నీటిని నోట్లో పోసుకున్న ప్రతిసారి నాలుకకు ఏదో సుతిమెత్తని అనుభూతి కలుగుతుందట. స్వచ్ఛమైన నీటిని ఇలా బాటిల్లో నింపుతుంది ఫిన్లాండ్ కు చెందిన ఓ కంపెనీ.
టెన్ థౌసండ్ బిసి 750 మిల్లీ లీటర్ల ధర 950 రూపాయలు. కెనడాలోని వాంకోవర్ నగరానికి 200 మైళ్ల దూరంలో ఉన్న ఆ పర్వత ప్రాంతంలో ఎవరు ఉండరు. జంతువులు కూడా కనిపించవు. అక్కడ 6000 అడుగుల లోతులో ఉండే హేమనీనదాలను కరిగించి వాటిల్లో నింపుతుంది 10000bc. ఆ తరువాత ఆక్వా డెకో. 750 మిల్లీలీటర్ల బాటిల్ ధర 800రూపాయలు. 18 వేల సంవత్సరాల కిందట ఘనీభవించిన హిమనీనదాల నుంచి సేకరించి నీరు ఇది. కెనడాకు చెందిన ఈ కంపెనీ ఈ బాటిల్ రూపొందించినందుకు బంగారు పతకాన్ని కూడా అందుకుంది.
ఎవియాన్.. ఈ బాటిల్ లీటరు ధర 600 రూపాయలు. 1789లో ఫ్రాన్స్ కు చెందిన మార్కిస్ అనే వ్యక్తి రోజు వాకింగ్ కు వెళుతూ స్థానికంగా ఏవియాన్ దగ్గర ఉన్న నీటి బుగ్గ దగ్గర ఉన్న నీటిని తాగే వాడట. నీటిని తాగడం మొదలుపెట్టాక కిడ్నీ, లివర్ సమస్యలు మాయమయ్యాయట. అది కాస్తా ప్రచారం కావడంతో ఆ నీటిని అమ్మడం వ్యాపారంగా మారింది. అదే తరువాతి కాలంలో ఒక బ్రాండ్ గా మారింది. చాలా మంది ప్రముఖులు ఈ నీటిని ప్రత్యేకంగా తప్పించుకొని తాగుతారు మనదేశంలోనూ ఈ నీటిని ఆన్లైన్లో అమ్ముతున్నారు.