Pregnents: గర్భంతో ఉన్న వారు ఇలాంటి పనులు చేస్తున్నారా?దాని ప్రభావం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదం..!

Pregnents: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భంతో ఉన్న మహిళలు శిశువు ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకొని ఆహారం జాగ్రత్తలు పుట్టబోయే శిశువు ఆరోగ్యాన్ని కాపాడతాయి, వారు తీసుకునే జాగ్రత్తలు ,ఆహారపు అలవాట్లు మీద శిశువు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

ప్రస్తుతం అందరూ పాశ్చాత్య సంస్కృతికి బాగా అలవాటు పడి మహిళలు మద్యం సేవించడం కూడా బాగా అధికమైపోయింది. గర్భంతో ఉన్న మహిళలు మద్యం సేవించడం వల్ల వారికి పుట్టబోయే బిడ్డకి ఎంత ప్రమాదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ కి ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆల్కహాల్ పుట్టబోయే శిశువు బరువు, మెదడు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. గర్భవతి గా ఉన్న సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అది సులభంగా పిండం లోకి చేరుతుంది. ఆ పిండానికి ఆల్కహాల్ జీర్ణం చేసుకునే శక్తి లేనందున అది అలాగే పేరుకుపోయి ఉంటుంది.

ఇటువంటి సమయంలో కడుపులో శిశువు ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు ఆక్సిజన్ సరిగా అందకపోవటం వల్ల బిడ్డ పుట్టిన తర్వాత మెదడు మీద వారి ఎదుగుదల మీద ఆల్కహాల్ ప్రభావం చూపుతుంది. బిడ్డపుట్టిన తర్వాత శరీర పెరుగుదల సరిగా లేకపోవటం, జ్ఞాపకశక్తి ,కంటి చూపు ,వినికిడి మందగించటం, గుండె సంబంధిత సమస్యలు, వంటి ఎన్నో ఇతర ఆరోగ్య సమస్యలు పిల్లలని వెంటాడుతాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి చేసే పొరపాటు వల్ల పిల్లలు జీవితాంతం ఇలా అనారోగ్యంతో బాధ పడాల్సి వస్తుంది. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ వల్ల చిన్న పిల్లల్లో తలెత్తే మానసిక శారీరక వైఫల్యాలకు మనం నయం చేయలేము.ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల ఆల్కహాల్ తీసుకోకపోవటం వల్ల ఎన్నో తరాలను వారు కాపాడిన వారవుతారు.