ఏపీలో కరెంట్ బిల్లులు అధికంగా రావడంతో రాష్ర్టంలో ప్రజలు ఆందోళనకు దిగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అండ్ కో మరింత రాజకీయం దిశగా అడుగులేస్తోంది. అసరమైన పెయిడ్ బ్యాచ్ ని అందోళకారుల్లోకి పంపించి ఆందోళల్ని మిన్నంటేలా చేస్తోంది. ప్రజల్ని ప్రభుత్వం మీదకు ఉసిగొలిపి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇప్పటికే బిల్లులపై ఏపీ ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. రీడీంగ్ ల్లో గానీ, బిల్లులు తీయడంలో గానీ ఏవైనా తప్పిదాలు ఉంటే సవరించుకుంటామని, మళ్లీ రీడింగ్ లు తీయాలని అధికారులను ఆదేశించారు సీఎం.
తప్పులుంటే సవరించుకుని కొత్త బిల్లులు ఇస్తామని అప్పటివరకూ బిల్లులు కట్టే పని కూడా లేదన్నారు. జూన్ వరకూ ఎవరూ బిల్లులు చెల్లించొద్దని తెలిపారు. అలాగే ఈనెలలో బిల్లులు అధికంగా రావడానికి మరో కారణాన్ని కూడా అధికారులు చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వడంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా జరిగిందని అందువల్లే బిల్లులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. వేసవి కావడంతో ఏసీలు అధికంగా వాడటం వల్ల బిల్లులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు. అయితే దీన్ని పచ్చ మీడియా పచ్చి పచ్చిగా చూస్తోంది. పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు పచ్చ మీడియా యధేశ్చగా వాస్తవాల్ని దాచి పెడుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తుంది.
దీనిపై వైకాపా నేతలు, మంత్రలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. 500 యూనిట్లు దాటిన గృహ వినయోగదారులకే మాత్రమే పెరుగుదల ఉందని మిగిలిన విభాగాల్లో ఎలాంటి మార్పులు లేదని పేర్కొన్నారు. ఏపీలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారే ఈ హడావుడి అంతా చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. అయితే ఏపీ వివరణల్లో కూడా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ తో ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కరెంట్ బిల్లులు మరీ ఎప్పుడు రానంత విధంగా వచ్చేస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.