ఈ వేసవి తాపం నుండి బయటపడటానికి ఉన్న రకరకాల మార్గాలలో ‘ఏసీ’ని ప్రముఖంగా పేర్కొనాలి. పల్లెల్లోనూ, పట్టణాలలోనూ ఏసీ వాడకం చాలా ఎక్కువైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఏసీని ఎక్కువగా వినియోగించటం వల్ల కంటే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. అలానే ఎక్కువ సమయం ఏసీని వినియోగించడం వల్ల ఏసీ సామర్థ్యం కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఏసీని కొన్న తర్వాత నెలా నెలా వచ్చే కరెంట్ బిల్లు చూసి కంగు తినకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఏసీ శక్తి సామర్థ్యం ఎక్కువ కాలం ఉండేందుకు , విద్యుత్ బిల్లును సులభంగా తగ్గించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఏసీలో 24 డిగ్రీల దగ్గర డిఫాల్ట్ ఉష్ణోగ్రతను ఉంచాలని.. ఏసీ ఉష్ణోగ్రతను తగ్గించే ప్రతి డిగ్రీకి 6 శాతం చొప్పున విద్యుత్ ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఏసీని 24 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉంచడం వల్ల విద్యుత్ ను ఆదా చేయడంతో పాటు 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకు కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు.
ఏసీ వేయడానికి ముందు ఫ్రిజ్, టీవీ, కంప్యూటర్ లాంటి వస్తువులను ఆఫ్ లో ఉంచి ఏసీ ఆన్ చేసిన కొంత సమయం తరువాత వాటిని ఆన్ చేసుకుంటే మంచిది. రూమ్ త్వరగా చల్లబడాలంటే రూమ్ లోని ఫ్యాన్స్ తో పాటు లైట్స్ ను తప్పనిసరిగా ఆపివేయాలి. ఏసీని 23 డిగ్రీల నుంచి 24 డిగ్రీల మధ్య ఉంచినా రూమ్ చల్లగా మారుతుందని చెప్పవచ్చు. ఏసీని అదే పనిగా ఆన్ చేసి ఉంచనవసరం లేదు, ఒకసారి రూమ్ కూల్ అయిన తర్వాత కొంచెం సేపు ఆఫ్ చేసి మరల ఆన్ చేయటంతో కరెంట్ బిల్లు అదా చేసుకోవచ్చు.
ఏసీ పని తీరుని గమనిస్తూ… ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఫిల్టర్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏసీలో దుమ్ము, ధూళి ఉంటే ఏసీ పని చేసే శక్తి తగ్గుతుంది కాబట్టి ఏసీని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏసీ పనితీరు బాగుండటంతో పాటు ఏసీ త్వరగా రిపేర్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు. వినియోగదారుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించి అధిక భారం పడకుండా తప్పించుకోవచ్చు.