Health Tips: మట్టి కుండలో ఉంచిన నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Health Tips: ప్రస్తుత కాలంలో జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల పాత పద్ధతులను మర్చిపోతున్నారు. వేసవికాలంలో పోస్టర్ విడుదల ఎక్కువగా ఉండటం వల్ల చల్లటి నీరు తాగితే హాయిగా అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం అందరి ఇళ్ళల్లో మట్టి కుండలు బదులు ఫ్రిజ్ లు దర్శనమిస్తుంటాయి. పూర్వం అన్ని పనులకూ మట్టి పాత్రలు ఎక్కువగా వాడేవారు. కానీ ప్రస్తుత కాలంలో స్టీల్,నాన్ స్టిక్ వస్తువులు, ఫ్రిజ్ లు వాడుతున్నారు. వీటిని ఉపయోగించటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వేసవి కాలంలో వాటర్ బాటిల్స్ లో నీరు పట్టి ఫ్రిజ్ లో ఉంచి తాగుతుంటారు. కానీ మట్టి కుండలో ఉంచిన నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

ఫ్రిజ్ లో ఉంచిన నీటితో పోల్చితే మట్టి కుండలో ఉంచిన నీటిలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కుండ నీరు శరీరంలో గ్లూకోజ్ స్థాయి సక్రమంగా ఉండేలా చేస్తాయి. ఫ్రిజ్ లో ఉంచిన చల్లటి నీరు తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కానీ మట్టి కుండలో ఉన్న నీరు తాగటం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

ఫ్రిజ్ లో ఉంచిన నీటిలో పీహెచ్ లెవెల్స్ క్రమంగా తగ్గిపోతాయి. కానీ మట్టి కుండలో ఉంచి కన్నీటిలో పి హెచ్ లెవెల్ సమతుల్యంగా ఉంటాయి. ఎక్కువ కాలం వాటర్ బాటిల్స్ లో నీరు ఉండటం వల్ల అందులో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఆ నీటిని తాగటం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు.

మట్టి కుండలో నీరు ఎక్కువ కాలం ఉంచినా కూడా ఎటువంటి బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. మట్టి కుండలో ఉంచిన నీరు తాగటం వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ సమతులం గా ఉండేలా చేస్తాయి. అందువల్ల శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు తలెత్తకుండా ఉంటాయి.