వైసీపీ పాలనలో దళితులు, మైనారిటీలు, బీసీలకు పెద్దపీట వేశామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. పదవుల్లో, పంపకాల్లో బీసీలకు, దళితులకు, మైనారిటీలకు సింహభాగం ఇచ్చామని సీఎం జగన్ చెబుతోన్న విషయం విదితమే. అయితే, తన సామాజిక వర్గానికి చెందిన వారికి జగన్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలుగా చేసి విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు పంచారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
దళితులపై సీఎం జగన్ ది మొసలికన్నీరని వారు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే సీఎం జగన్ ప్రవర్తన కూడా ఉండడంతో ఆ ఆరోపణలకు ఊతం వచ్చింది. తిరుపతి దళిత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిచెందితే కనీసం పరామర్శించడానికి తీరిక లేని జగన్….ఇటీవల మరణించిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని స్వయంగా పరామర్శించడంపై విమర్శలు వస్తున్నాయి.
కరోనా బారిన పడి తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కొంతకాలం క్రితం మరణించారు. కేవలం సంతాపం ప్రకటించిన జగన్ వారి కుటుంబసభ్యులను ఇంటికి వెళ్లి పరామర్శించడం వంటి కార్యక్రమాలు చేయలేదు. అయితే, ఇటీవల తన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ v చెందడంతో వారి కుటుంబాన్ని జగన్ ఆగమేఘాలపై వెళ్లి పరామర్శించారు. దీంతో, జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీీపీలో దళితులకు ఒక న్యాయం? సొంత సామాజిక వర్గం వారికి ఒక న్యాయమా ? అంటూ విమర్శలు వస్తున్నాయి.
దళితులపై జగన్ కు నిజంగా ప్రేమ ఉంటే..ఇలా ఎందుకు చేస్తారన్న విమర్శలు వస్తున్నాయి. పెద్ద పెద్ద పదవుల్లో తన సామాజిక వర్గానికి జగన్ పెద్ద పీట వేశారన్న ఆరోపణలకు ఈ ఘటనలు నిదర్శనమని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. జగన్…దళితులకిచ్చే గౌరవమిదేనా? అని విమర్శలు వస్తున్నాయి. జగన్ వైసీపీలో దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా నోరు తెరిచి ఈ విషయంపై మాట్లాడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి, ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు, జగన్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.