Health Tips: పిల్లలు తరచూ ఈ పనులు చేస్తున్నారా? ఆ అలవాటు మాన్పించాలంటే ఈ పనులు చేయాల్సిందే..!

Health Tips: చిన్న పిల్లలు సాధారణంగా బాగా అల్లరి చేస్తుంటారు. ఒక మనిషి వారిని తరచూ జాగ్రతగా చూసుకోవాల్సి వస్తుంది. అయితే కొత్త మంది పిల్లలు తరచూ తమ చేతిని, వేళ్లను నోటిలో కానీ, ముక్కులో కానీ, చెవిలో కానీ పెట్టుకుంటు ఉంటారు. పిల్లలకు ఇటువంటి అలవాటు ఉంటే కనుక అవి వారిని ఇతర ఆరోగ్య సమస్యలకు గురి చేస్తాయి. పిల్లలు ఎక్కువగా నేల మీద ఆడుకుంటూ ఉంటారు, ఏ వస్తువు దొరికితే అది చేతులతో పట్టుకొని, చేతిని శుభ్రం చేసుకోకుండా నోటిలో వేళ్ళు పెట్టుకుంటు ఉంటారు. దీని వల్ల ఎక్కువగా వైరస్లు, ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు. పిల్లల నుండి ఈ అలవాటు మాన్పించడానికి తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలం అవుతుంటారు. పిల్లలకు ఈ అలవాటు మాన్పించడానికి క్రింది చిట్కాలను పాటించడం వల్ల ఫలితం ఉంటుంది.

– పిల్లలు పదే పదే నోటిలో, ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివలన ముక్కు కు ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.
– మీరు ఎన్నిసార్లు చెప్పినా మీ పిల్లలు వేలు ని నోటిలో పెట్టుకుంటున్నట్లు అయితే, వారి రెండు వేళ్ళని కలిపి టేపు వేయండి. వారు క్రమంగా ఈ అలవాటు నుండి దూరం అవుతారు. అయితే ప్రతిసారీ ఈ పద్ధతి పాటించడం మంచిది కాదు.
– నోటిలో, ముక్కులో ఎక్కువగా వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లలకు నీళ్లు ఎక్కువగా తాగేలాగ చూసుకోవాలి. పిల్లలు డీహైడ్రేట్ అయినప్పుడు నోటిలో వేలు పెట్టుకుంటుంటారు.
– ఈ అలవాటు ఉన్న పిల్లలకు చేతిలో కర్చీఫ్ లాంటిది ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి. ఏదైనా వస్తువు చేతిలో ఉండటం వల్ల వారి వేళ్ళు నోటిలో పెట్టే అవకాశం ఉండదు.
– నోటిలో లేదా ముక్కులో వేలు పెట్టే అలవాటు ఉన్న పిల్లలకు ఎక్కువగా ఆటబొమ్మలను ఇవ్వాలి. వాటితో ఆడుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల వారికి వేళ్ళు నోట్లో పెట్టుకోవాలనే ఆలోచన దూరమవుతుంది.