Tik Tok DurgaRao: నెలకు టిక్ టాక్ దుర్గారావు ఎంత సంపాదిస్తారో తెలుసా?

Tik Tok DurgaRao:రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఎంతోమంది ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకు వస్తున్నారు. ఇలా వారి నైపుణ్యాన్ని బయటపెట్టడంతో చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చి అద్భుతమైన పాత్రలలో నటిస్తూ కెరియర్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలాంటి వారిలో టిక్ టాక్ దుర్గారావు ఒకరు. టిక్ టాక్ ద్వారాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని మెల్లిమెల్లిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ముఖ్యంగా పలాస చిత్రంలోని నాది నక్కీలీసు గొలుసు అనే పాట ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దుర్గారావుకి అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు అదేవిధంగా బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలలో ఈ జంట సందడి చేశారు. అదే విధంగా పలు సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకున్నారు.

ఇలా టిక్ టాక్ ద్వారా ఎంతో బిజీగా ఉన్న దుర్గారావు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తే సుమారు 5 నుంచి 10 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ఇలా ఇంటర్వ్యూలు ద్వారా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ దుర్గ రావు దంపతులు నెలకు సుమారు 50 నుంచి 60 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తోంది.