దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తుంది. ఎస్బిఐ బ్యాంక్ అందిస్తున్న వివిధ రకాల పథకాల ద్వారా ప్రజలు నెల నెల ఎంతో ఆదాయం పొందుతున్నారు. , ఎస్బిఐ బ్యాంక్ లో ఉన్న ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేసి నెల నెల 70 వేల రూపాయల ఆదాయం పొందవచ్చు. ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంఛైజ్ తీసుకొని నెలకు 60 వేల నుండి 70 వేల వరకు ఆదాయం పొందవచ్చు. ఇలా మీ వద్ద ఉన్న ఐదు లక్షల రూపాయల డబ్బుని ఎస్బిఐలో ఒకసారి పెట్టుబడి పెడితే చాలు. దేశంలో వివిధ ప్రదేశాలలో ఎస్బిఐ ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి ఫ్రాంఛైజ్ తీసుకోవచ్చు.
ఇలా దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలలో ఏటీఎంలను ఏర్పాటు చేసే బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ ఉంటారు. ఇలా టాటా ఇండీక్యాష్, ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం లాంటి సంస్థలు ఏటీఎం ఫ్రాంఛైజ్‌లు ఇస్తుంటాయి. ఈ ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంఛైజ్ తీసుకోవాలనుకుంటే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఏటీఎం ఫ్రాంఛైజ్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ :
1. ఐడీ ప్రూఫ్ – ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , ఓటర్ కార్డ్.
2. అడ్రస్ ప్రూఫ్ – రేషన్ కార్డ్, కరెంటు బిల్లు.
3. బ్యాంక్ అకౌంట్, పాస్‌బుక్.
4. ఫోటోగ్రాఫ్, ఇ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్.
5. జీఎస్‌టీ నెంబర్.
6. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్.
ఇలా ఈ పాత్రలలో ఏటీఎం ఫ్రాంచైజ్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
వివిధ బ్యాంక్ లకు సంబంధించిన వెబ్సైట్ వివరాలు :
1. టాటా ఇండీక్యాష్- www.indicash.co.in
2. ముత్తూట్ ఏటీఎం- www.muthootatm.com/suggest-atm.html?utm_source=DailyHunt&utm_medium=referral&utm_campaign=dailyhunt&comscorekw=dailyhunt
3. ఇండియా వన్ ఏటీఎం- india1atm.in/rent-your-space
ఏటీఎం ఫ్రాంచైజ్ ద్వారా వచ్చే ఆదాయం ఇలా :
దేశంలో ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంఛైజ్‌లు అందిస్తున్న అతిపెద్ద కంపెనీ టాటా ఇండీక్యాష్. ఎస్బిఐ ఎటిఎం ఫ్రాంచైజ్ కోసం రూ.2,00,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి ఏటీఎం ఫ్రాంఛైజ్ తీసుకోవచ్చు. ఈ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండబుల్. దీంతో పాటు రూ.3,00,000 వర్కింగ్ క్యాపిటల్ తో కలిపి మొత్తం రూ.5,00,000 పెట్టుబడి పెట్టాలి. ఈ ఏటీఎంలో ప్రతీ క్యాష్ ట్రాన్సాక్షన్‌కు రూ.8, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్‌కు రూ.2 చొప్పున కమిషన్ లభిస్తుంది. ఇలా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరగటం వల్ల ఎక్కువ ఆదాయం పొందావచ్చు. ఉదాహరణకు రోజూ 500 ట్రాన్సాక్షన్స్ జరిగాయనుకుందాం. అందులో 250 క్యాష్ ట్రాన్సాక్షన్స్, 250 నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటే రోజూ రూ.2,500 చొప్పున రూ.75,000 వరకు కమిషన్ వస్తుంది.