ట్విట్టర్ షాకింగ్ ప్రకటన..గంజాయి ఉత్పత్తులు ప్రమోషన్స్ కి గ్రీన్ సిగ్నల్..?

ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ లో ఒకటైన ట్విట్టర్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ప్రముఖ టెక్‌ దిగ్గజం ఎలన్ మస్క్‌ ట్విట్టర్ కోనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ట్విట్టర్ విషయంలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు, టెక్ నిపుణులను షాకింగ్ కి గురిచేస్తున్నాయి. ఇటీవల ట్విట్టర్ బ్లూ పేరిట సబ్ స్క్రిప్షన్, అంతే కాకుండా ఇటీవల భారతదేశంలో రెండు ట్విట్టర్ కార్యాలయాలను మూసేసి.. ఇంటి నుంచి పనిచేయమని చెప్పడం పెద్ద చర్చకు దారి తీశాయి. ఇక తాజాగా ట్విట్టర్ నుండి మరొక షాకింగ్ ప్రకటన వెలువడింది.

ట్విట్టర్ అనేది సోషల్ మీడియా విభాగాల్లో చాలా ప్రభావవంతమైందని అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ట్విట్టర్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ ప్రాభవం కాస్త తగ్గిందనే చెప్పాలి. తాజాగా గంజాయి సంబంధిత ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు ట్విట్టర్ కొత్త పాలసీని తీసుకొచ్చినట్లు ప్రకటన వెలువడింది. దీంతో గంజాయి ఉత్పుత్తులు ప్రమోట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తొలి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గా ట్విట్టర్ నిలిచింది.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ వంటి సంస్థలు మాత్రం గంజాయి ఉత్పత్తుల ప్రమోట్ చేయకూడదని పాలసీగా పెట్టుకుంటే ట్విట్టర్ మాత్రం వాటికి విరుద్ధంగా అమెరికాలో గంజాయి ఉత్పత్తులను ప్రమోట్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గంజాయి ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు అమెరికా వరకు మాత్రమె ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ, ఆ కంపెనీకి సరైన అనుమతులు ఉండి తీరాలి. అంతే కాకుండా షరతులు, పరిధికి లోబడే ఈ యాడ్స్‌ ని డిస్ ప్లే చేయనున్నట్లు చెప్పారు. అలాగే 21 ఏళ్లలోపు యువతను ఈ విషయంలో ప్రేరేపించబోమనిట్విట్టర్ తెలిపింది. ఇప్పుడు గంజాయి ఉత్పత్తుల విషయంలో ట్విట్టర్ తీసుకున్న నిర్ణయం అందరినీ అబ్బురపరచడమే కాకుండా.. ఆగ్రహం వ్యక్తం చేసేలా చేస్తోంది.