యూట్యూబ్ ద్వారా సుమ నెలకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే…?

బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమ తన మాటలతో ఇటు బుల్లితెర ప్రేక్షకులను అటు వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నెంబర్ వన్ యాంకర్ గా గుర్తింపు పొందింది. బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో సందడి చేయడమే కాకుండా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సందడి చేస్తోంది.

అంతేకాకుండా మరొకవైపు సినిమాలలో నటిస్తూ.. నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఇలా యాంకర్ గా నటిగా వరుస షూటింగ్ లతో బిజీగా ఉండే సుమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంటుంది. ఇటీవల సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సుమ తనకు సంబంధించిన వీడియోస్ ని తన అభిమానులతో పంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.

ఇలా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో నివసిస్తున్న వారు కూడా యూట్యూబ్ లో సుమ ని ఫాలో అవ్వటం వల్ల అధిక సంఖ్యలో ఆదాయం పొందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీవి షోస్, ఈవెంట్స్ ద్వారా లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్న సుమ యూట్యూబ్ ద్వారా కూడా లక్షల్లో ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. యూట్యూబ్లో సుమ షేర్ చేసి వీడియోలకు గాను నెలకు దాదాపు రూ. 2.5 నుండి 3 లక్షల వరకు ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది.