ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది తమలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకొని సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ సీజన్ 5 లో అవకాశం దక్కించుకున్న గంగవ్వ గురించి తెలియని వారంటూ ఉండరు. మై విలేజ్ షోస్ పేరుతో యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది.
గంగవ్వ వయసు పైబడిన తర్వాత ఇలా యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన గంగవ్వ అక్కడి వాతావరణం అలవాటు లేకపోవటంతో కొంతకాలానికి హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలలో నటిస్తూ బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. ఇక తనకి గుర్తింపునించిన యూట్యూబ్ వీడియోస్ మాత్రం తరచూ షేర్ చేస్తూ ఉంటుంది.
గ్రామంలో కూలి పనులు చేసుకుని జీవనం సాగించే గంగవ్వ యూట్యూబ్ ద్వారా ఫేమస్ అవ్వటమే కాకుండా భారీ మొత్తంలో ఆదాయం కూడా అందుకుంటుంది. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ తో పాటు సొంత యూట్యూబ్ ఛానల్ ని కూడా ప్రారంభించిన గంగవ్వ నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందుతున్నట్లు ఆమె సన్నిహితులు ద్వారా సమాచారం అందుతోంది.