దేశంలో అతి త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు తెలుగువారు బరిలోకి దిగనున్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే నిన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మాజీ మంత్రులు, తన తండ్రి హయాం నుంచి పార్టీలో కొనసాగుతున్న వారితోపాటు యువతకు కూడా చోటిస్తూ ఆ పార్టీ అధినేత స్టాలిన్ జాబితా రూపొందించారు. 78 మంది సిట్టింగులకు మళ్లీ అవకాశం ఇచ్చిన స్థాలిన్.. ఏడుగురు తెలుగువారికి కూడా టికెట్లు ఇచ్చారు.
త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు తెలుగువారు బరిలోకి దిగనున్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే నిన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మాజీ మంత్రులు, తన తండ్రి హయాం నుంచి పార్టీలో కొనసాగుతున్న వారితోపాటు యువతకు కూడా చోటిస్తూ ఆ పార్టీ అధినేత స్టాలిన్ జాబితా రూపొందించారు. 78 మంది సిట్టింగులకు మళ్లీ అవకాశం ఇచ్చిన స్థాలిన్.. ఏడుగురు తెలుగువారికి కూడా టికెట్లు ఇచ్చారు.
డీఎంకే సీటిచ్చిన తెలుగువారిలో, చెన్నై హార్బర్ నుంచి పీకే శేఖర్‌బాబు, సైదాపేట నుంచి ఎం.సుబ్రహ్మణ్యం, అన్నానగర్ నుంచి ఎంకే మోహన్, తిరుచ్చి వెస్ట్ నుంచి కేఎన్ నెహ్రూ, తిరువణ్ణామలై నుంచి ఏవీ వేలు, కృష్ణగిరి జిల్లా హోసూరు నుంచి వై. ప్రకాష్, విల్లుపురం జిల్లా తిరుక్కోవిలూర్ నుంచి కె.పొన్ముడి బరిలోకి దిగుతున్నారు.