క్రేజీ అప్డేట్ : టిల్లు కొత్త టైటిల్, కొత్త హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.!

ఈరోజు దీపావళి కానుకగా టాలీవుడ్ నుంచి ఎన్నో చిత్రాలుకి సంబంధించి చాలానే అప్డేట్స్ బయటకి వచ్చాయి. అలాగే లేటెస్ట్ గానే టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం డీజే టిల్లు చిత్రం సీక్వెల్ పై కూడా ఓ అప్డేట్ రానున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు. మరి ఈ అప్డేట్ తో అయితే ఓ ఇంట్రెస్టింగ్ వీడియో తో క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

డీజే టిల్లు సీక్వెల్ ని అనౌన్స్ చేస్తూ అదిరే వీడియోని రిలీజ్ చేసి సిద్ధూ తో గత చిత్రం ఫిష్ వెంకట్ తో ఇంట్రెస్టింగ్ సీన్ చూపించారు. అంతే కాకుండా ఇందులో టిల్లు మొత్తం గెటప్ సెటప్ అంతా మారిపోయింది. ఇలా దీనితో అయితే ఈ చిత్రానికి డీజే టిల్లు 2 అని కాకుండా “టిల్లు స్క్వేర్” అంటూ అనౌన్స్ చేశారు.

అలాగే గత సినిమాలో అయితే హీరోయిన్ నేహా శెట్టి తన గ్లామర్ తో అదరగొట్టేయగా ఇక ఈ రెండో సినిమాలో అయితే యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు. దీనితో ఈ చిత్రంలో ఎవరు నటిస్తారు అనేది క్లారిటీ వచ్చేసింది.

ఇక ఈ చిత్రాన్ని అయితే “అద్భుతం” చిత్రం దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని డబుల్ డోస్ తో నిర్మాణం వహిస్తున్నారు.