ఇన్సైడ్ టాక్ : “టిల్లు 2” నుంచి ఈ హీరోయిన్ కూడా అందుకే తప్పుకుందా.?

ఇపుడు టాలీవుడ్ దగ్గర రానున్న రోజుల్లో వస్తున్న ఇంట్రెస్టింగ్ సీక్వెల్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ యూత్ ఫుల్ హిట్ చిత్రం “డీజే టిల్లు 2” కూడా ఒకటి. మరి మొదటి సినిమా అంచనాలు మించి సూపర్ హిట్ కావడంతో దీనిపై అనేక అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రం కి మాత్రం వరుసగా హీరోయిన్ మార్పులు అనేది కాస్ట్ ఆసక్తిగా మారుతూ వస్తున్నాయి. మరి ఈ చిత్రానికి ఆల్రెడీ శ్రీ లీల తర్వాత అనుపమ పరమేశ్వరన్ మరియు లేటెస్ట్ గా మడోనా సెబాస్టియన్ లు తప్పుకున్నారు. దీనితో ఈ చిత్రం ఫైనల్ గా మీనాక్షి చౌదరి దగ్గరకి వచ్చింది.

మరి ఈమెకి ముందు అప్రోచ్ చేసిన హీరోయిన్ మడోనా ఎందుకు బయటకి వెళ్లినట్టు అనే టాక్ రాగా ఇప్పుడు దీనిపై క్లారిటీ సినీ వర్గాల నుంచి తెలుస్తుంది. మరి దీనికి కారణం కూడా గతంలో అనుపమ బయటకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇప్పుడు మడోనా కూడా అదే కారణంతో వెళ్లినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు లిప్ లాక్ సీన్స్ ఓవర్ గా ఉండడం వల్లే మడోనా కూడా బయటకి వెళ్ళిపోయినట్టుగా అంటున్నారు. మరి మీనాక్షి పై అయితే అధికారిక అనౌన్సమెంట్ ఇంకా రావాల్సి ఉంది.