ఇన్సైడ్ టాక్ : “డీజే టిల్లు 2” కి మరో బ్యూటీని చేంజ్ చేస్తున్నారా.?

కొన్ని సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ నెక్స్ట్ సినిమాల్లో అయితే అనేక మార్పులు వస్తున్నాయి అంటే డెఫినెట్ గా అది మన టాలీవుడ్ లో అయితే ఓ బ్యాడ్ సైన్ గానే చూస్తారు. మరి ఈ చిత్రం లిస్ట్ లోకి యంగ్ హీరో చేస్తున్న చిత్రం డీజే టిల్లు కి సీక్వెల్ టిల్లు స్క్వేర్ కూడా వస్తుందని చెప్పాలి.

మరి ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు నెలకొనగా అంతా బాగానే ఉన్నా సినిమాలో హీరోయిన్ పరంగా ఎప్పటికప్పుడు అనేక మార్పులు జరుగుతూ వస్తుండడం ఆసక్తిగా మారుతుంది. మరి ఈ సినిమా అనౌన్స్ చేసిన కొత్తలో యంగ్ హీరోయిన్ శ్రీ లీలా ని ముందు అనుకున్నారు కానీ పలు కారణాలతో ఆమె అవుట్ అయ్యి హీరోయిన్ అనుపమ వచ్చింది.

కానీ ఆమె కూడా సినిమాలో కొన్ని సీన్స్ మరియు డైలాగ్స్ బాగాలేవని బయటకి వెళ్ళిపోయింది. తర్వాత ప్రేమమ్ మరియు శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ మడోనా సెబాస్టియన్ ని ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈమెతో పాటుగా మరో యంగ్ బ్యూటీ ని కూడా అనుకుంటున్నారని కొన్ని గాసిప్స్ బయటకి వచ్చాయి.

ఆమె అయితే యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి అట. ఈమె పేరు కూడా హీరోయిన్ లిస్ట్ లో ఉందని అయితే ఇందులో ఇద్దరూ ఉంటారా లేక ఒకరే ఉంటారా అనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ప్రస్తుతానికి హీరో సిద్ధూ పై షూటింగ్ అవుతుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ ని కూడా తాను లాక్ చేసుకున్నాడు.