గాసిప్స్ : “డీజే టిల్లు 2” కి మరో హాట్ బ్యూటీ..?

గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ లో మంచి హాట్ హాట్ గా వినిపిస్తున్న లేటెస్ట్ చిత్రం “డీజే టిల్లు” కోసం అలా ఏదొక వార్త నడుస్తూనే ఉంది. మరి ఈ చిత్రంలో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ కీలక పాత్ర చేస్తున్నాడు. పాత్ర అంటే సినిమాలోనే కాకుండా సినిమా మేకింగ్ సహా హీరోయిన్ విషయంలో కూడా తాను కలుగజేసుకుంటున్నాడు.

మరి మొదటి సినిమాలో నేహా శెట్టి రోల్ అయ్యాక ఇక పార్ట్ 2 లో హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అయ్యారు అనేది మాత్రం అలా హాట్ టాపిక్ గా మారుతూ వస్తూనే ఉంది. అలా ఇప్పటికి శ్రీ లీల, అనుపమ పరమేశ్వరన్ అలాగే మడోనా సెబాస్టియన్ మొత్తం ముగ్గురు హీరోయిన్ లు సినిమా నుంచి తప్పుకున్నారు.

కానీ ఇప్పుడు అయితే ఫైనల్ గా హిట్ సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫైనల్ అయ్యినట్టుగా రూమర్స్ రాగా అయితే ఇప్పుడు సేఫ్ సైడ్ గా మరో యంగ్ అండ్ హాట్ బ్యూటీ ని మేకర్స్ పరిశీలనలో చేసినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ హీరోయిన్ ఎవరో కూడా కాదట.

రొమాంటిక్, రీసెంట్ గా రంగ రంగ వైభవంగా చిత్రంలలో కనిపించిన హీరోయిన్ కేతిక శర్మ అట. మరి ఈమె పేరు కూడా ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. మరి ఫైనల్ గా ఎవరు లాక్ అవుతారో కానీ ఈ సినిమా హీరోయిన్ అంశం మాత్రం అలా సస్పెన్స్ గా మారుతూ వస్తుంది.