దివాళాంధ్రపదేశ్.. వైఎస్ జగన్‌కి బ్యాడ్ రిమార్క్ అవుతుందా.?

Jagan-Mohan-ap-cm

Jagan-Mohan-ap-cm

అమ్మ ఒడి అంటున్నారు.. నాన్న బుడ్డీ పేరుతో దోచేస్తున్నారు.. చెప్పకుంటూ పోతే, ప్రతి కొత్త సంక్షేమ పథకానికీ విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు అత్యంత దారుణంగా వుంటున్నాయి ఆంధ్రపదేశ్‌లో. ఎందుకిలా.? రాజకీయ పార్టీలు రాజకీయమే చేయాలి. విపక్షాలన్నాక విమర్శించాలి. ప్రతిపక్షంలో వున్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసింది కూడా అదే. కానీ, ఆంధ్రపదేశ్ చాలా చాలా ప్రత్యేక పరిస్థితుల్లో వుంది. ఇదిప్పుడు కొత్తగా చెప్పుకునే మాట కాదు. ఎప్పుడైతే ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిందో, అప్పుడే, 13 జిల్లాల ఆంధ్రపదేశ్ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆనాటి నుంచి నేటివరకు.. రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేదు.. రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఎవరికీ సరైన అవగాహన లేదు. ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ.. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టకోవాలని టీడీపీ.. ఐదేళ్ళు నానా రకాల రాజకీయాలు చేశాయి. ఇప్పుడు టీడీపీ, ఎలాగైనా వైసీపీని పడెయ్యాలనుకుంటోంది. అంతే తేడా. అప్పుల విషయంలో రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని గట్టున పడెయ్యలేవు.

మరింతగా రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టేస్తుంది. సంక్షేమ పథకాల పేరుతో జనంలోకి డబ్బుని తీసుకెళ్ళడంలో సఫలమవుతోంది వైఎస్ జగన్ సర్కార్. కానీ, దాని వల్ల భవిష్యత్తు ప్రయోజనాలేముంటాయి.? ఏమీ వుండవు. ఐదేళ్ళ పాలన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, ప్రజలు బహుశా ఏ సంక్షేమ పథకాన్నీ గుర్తుపెట్టుకోరేమో. సంక్షేమ పథకాలకే ఓట్లు రాలితే, చంద్రబాబు.. అధికారంలోనే వుండి వుండాలి. అభివృద్ధి కావాలి రాష్ట్రానికి. అప్పుల కుప్పగా మార్చేసే సంక్షేమం వల్ల రాష్ట్రానికి అస్సలు ఉపయోగం వుండదు. సలహాదారులు రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా, ముఖ్యమంత్రి మెప్పు కోసమే సలహాలు ఇస్తున్నారా.? ముఖ్యమంత్రి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించడంలేదా.? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయంటే ఆ స్థాయిలో దివాళాంధ్రపదేశ్ దిఘా రాష్ట్రం వెళుతోందన్నది రాజకీయ విశ్లేషకుల విమర్శ.