ఏపీ న్యాయ వ్య‌వ‌స్థ‌ను ఓ కుదుపు కుదుపుతున్న జగన్ సంచలన నిర్ణయం.. ?

cm jagan telugu rajyam

 

ఏపీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు ప్రఛ్ఛన్న యుద్ధం నడుస్తుందా అంటే పరిస్థితులు అదే స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.. ఇక ఏపీ సీయం వైఎస్ జగన్ సీనియర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. అదీ గాకుండా సుప్రీంకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో పాటు హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేసి దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనాలు సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ అంశంపై ఇండియా టుడే చాన‌ల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.. కోర్టుల్లో జరుగుతున్న అవినీతిపై మ‌రో సారి త‌న అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్, సీజేఐకి లేఖ రాసి మంచి ప‌ని చేశార‌ని, ఆ లేఖ‌ను బ‌హిరంగ ప‌రిచి మ‌రింత మంచి ప‌ని చేశార‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఇదే కాకుండా ఈ లేఖ‌ను బ‌హిరంగం చేయ‌క‌పోతే అసలు వాళ్లు విచార‌ణ ఊసే ఎత్తరనే కొత్త లాజిక్‌ను తెర‌పైకి తెవడమే కాదు..ఈ విషయం పై అత్యంత నిజాయితీప‌రులైన ముగ్గురు రిటైర్డ్ జ‌డ్జీలతో విచార‌ణ క‌మిటీ వేయాల‌ని డిమాండ్ చేయ‌డం విశేషం.

మొత్తానికి ఏపీ న్యాయ వ్య‌వ‌స్థ‌ను ఓ కుదుపు కుదుపుతున్న జగన్ సంచలన నిర్ణయానికి సపోర్ట్‌గా నిలిచిన ప్ర‌శాంత్ భూష‌ణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, న్యాయ వ్య‌వ‌స్థ మ‌ధ్య చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు. చివ‌రికి ఈ వ్య‌వ‌హారం ఏ మలుపు తిర‌గ‌నుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి ఉంది. ఇకపోతే ఈ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ న్యాయవ్యవస్థపై పలు ఆరోపణలు చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడిన సంగతి విదితమే..

కాగా ఈ న్యాయమూర్తుల వివాదంలో వైఎస్ జ‌గ‌న్ స‌ద‌రు ఫిర్యాదు లేఖ‌ను బ‌హిరంగ ప‌ర‌చ‌డంపై న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారట. ఇలా చేయడం కోర్టు ధిక్క‌ర‌ణ కింద వ‌స్తుంద‌ని అనుకుంటున్నారట.. మరి వైఎస్ జగన్‌కు ఈ విషయంలో అనుకూలంగా తీర్పు వస్తుందో, లేక వ్యతిరేకంగా వస్తుందో తెలియాలంటే వేచి చూడాలి..