Tirumala: కలియుగ దైవం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజు కొన్ని కోట్ల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. కేవలం మన భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నియమనిష్టలను ఆచరిస్తూ కొండపైకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
ఇకపోతే గత కొద్దిరోజులుగా తిరుమల కొండపై ఎన్నో ఆశ్చర్యకర వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భక్తులు తీవ్ర స్థాయిలో ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కూటమి ప్రభుత్వ నేతలు తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని ఆవు కొవ్వుతో తయారుచేసిన లడ్డూలను భక్తులకు ఇచ్చారు అంటూ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యాయి.
ఇలా జంతువుల కొవ్వుతో లడ్డు తయారు చేశారని ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. అదేవిధంగా ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జారీ చేస్తున్న నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో సుమారు 6 మంది భక్తులు మరణించారు. ఇంకా ఈ ఘటన మర్చిపోకముందే కొండ పై మరో అపచారం జరిగింది. కొంతమంది భక్తులు కొండపైకి పలావ్ తో పాటు కోడిగుడ్ల కూరను తీసుకువెళ్లి కొండను అపవిత్రం చేశారు.
తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని గుమ్మడిపూడి గ్రామానికి చెందిన వారు శుక్రవారం అలిపిరి మార్గం ద్వారా కొండపైకి వచ్చారు. కొండపైకి చేరుకున్న తర్వాత రాంభగీచ బస్టాండ్ కు సమీపంలో పార్కింగ్ ప్రాంతంలో వారంతా తాము తెచ్చుకున్న పలావ్, కోడిగుడ్ల కూర తిన్నారు. ఈ విషయం గమనించిన తోటి భక్తుల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భక్తులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇలా పోలీసులు వారిని విచారించడంతో తాము తమిళనాడు నుంచి వస్తున్నామని అయితే మాకు తిరుమల స్వామివారి నియమ నిబంధనలు తెలియకపోవటం వల్లే ఇంట్లో వండిన కోడి గుడ్ల కూర పలావ్ తిన్నామని తెలిపారు. ఇలా కొండపైకి మాంసాహారం తీసుకువెళ్లడతో అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటూ మండిపడుతున్నారు.