రావణుడి గెట్ అప్ మీద స్పందించిన  ఓం రౌత్

తన మొదటి సినిమా ‘తానాజీ’ తో సూపర్ హిట్ అందుకున్న ఓం రౌత్, తన రెండో సినిమా ‘ఆదిపురుష్’ తో అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. సినిమా షూటింగ్ అయిపోయి చాలా రోజులు అయినా కానీ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ప్రేక్షకులు చాలా నిరాశపడ్డారు. కొన్ని రోజులు క్రితం ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ చేసారు. అయితే టీజర్  లో ప్రధాన పాత్రల చిత్రీకరణ మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయని నెటిజన్లు ట్రోలింగ్ చేసారు.  అలాగే రావణుడు – ఆంజనేయుడు పాత్రల లుక్స్ మరియు వేషధారణపై కొన్ని రాజకీయ పక్షాలు – హిందూ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.

దీని పై దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. ట్రోలింగ్ మరియు వివాదంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రామాయణ గాథను నేటి యువతరం మరియు పిల్లలకు అర్థమయ్యేలా.. వారి అభిరుచికి తగ్గట్లు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగిందని ఓం రౌత్ అన్నాడు.

ఇప్పటి ప్రేక్షకులు ‘హ్యారీ పోర్టర్’ లాంటి సినిమాలకు అలవాటు పడ్డారని.. అందుకే వారిని ఆకట్టుకోవడానికి ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి రామాయణాన్ని మోడర్న్ గా చూపించే ప్రయత్నమే ఈ సినిమాలో జరిగిందని ఓం రౌత్ వివరించాడు.

రావణుడు అంటే రాక్షసుడు.. చెడుకు ప్రతీక అని భావిస్తుంటామని.. ప్రస్తుత కాలంలో ఒక చెడ్డ వ్యక్తి ఎలా ఉంటాడనే ఊహతో ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు ‘ఆది పురుష్’ అన్నాడు ఓం రౌత్. లంకేశ్ పక్షి మీద పయనించడంపై మాట్లాడుతూ.. పుష్పక విమానం మీదే రావణుడు విహరించినట్లు ఎక్కడా ఆధారం లేదని ఆయన అన్నారు. రామాయణానికి మోడర్న్ వెర్షన్ లాగా ‘ఆదిపురుష్’ సినిమాని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే ఇలాంటి ప్రయత్నం చేశామని ఓం రౌత్ వివరించారు.

సంక్రాంతి సందర్భంగా జనవరి 12  ని న ఈ మూవీ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు వరుస ఫ్లోప్స్ లో ఉన్న ప్రభాస్ కి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.