ప్రభాస్ తో తీసే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన డైరెక్టర్ మారుతి..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇక అందులో డైరెక్టర్ మారుతి తో కూడా ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా గురించి తాజాగా మారుతి ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు బయట పెట్టాడు. డార్లింగ్, బుజ్జిగాడు తరహాలో కథ ఉంటుంది అని.. మార్క్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది అని అన్నాడు.

ఇక దసరాకి సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నాము అని అన్నాడు. అంతేకాకుండా చిరంజీవి సినిమా గురించి కూడా మాట్లాడుతూ.. చిరంజీవి తనతో సినిమా చేయటానికి రెడీగా ఉన్నాడు అంటే తనకు చాలా సంతోషం కలిగిందని.. తనపై నమ్మకం ఉందని చిరంజీవి చెప్పటంతో తనను మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది అని.. త్వరలో కథ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు మారుతి.