Lokesh Kanagaraj: కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఒకరు. ఈయన అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా దర్శకుడుగా ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్న లోకేష్ త్వరలోనే రజినీకాంత్ తో చేసిన కూలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ లోకేష్ తో పాటు ఇతర చిత్ర బృందం కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు డైరెక్టర్ లోకేష్ ఏకంగా 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి..ఇలా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ వస్తున్న వార్తలపై లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ సినిమా కోసం 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటే తప్పేంటి అంటూ మాట్లాడారు.
ఈ సినిమా కోసం తాను గత రెండు సంవత్సరాలుగా ఎంతో కష్టపడుతున్నాను అంతేకాకుండా మరి ఇతర సినిమాలకు కూడా కమిట్ అవ్వలేదు. అందుకే ఈ సినిమా కోసం తాను ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నానని తెలిపారు.నేను నా పన్నులు చెల్లిస్తున్నా. నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చేయాల్సిన త్యాగాల గురించి నాకు ఎలాంటి బాధ లేదు. నా గత రెండేళ్ళు పూర్తిగా ‘కూలీ’ నిర్మాణంలోనే గడిచింది. అది నా బాధ్యత అని తెలిపారు. లియో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్లపైగా కలెక్షన్లు రాబట్టిన నేపథ్యంలో నా రెమ్యూనరేషన్ ఈ స్థాయికి పెరిగిందని ఈ సందర్భంగా లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు.
