Prabhas: 75 సార్లు ప్రభాస్ కు కథ చెప్పాను…. వారి వల్లే సినిమా చేయలేకపోయా….. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

Prabhas: ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం సినిమాలు చేయాలి అంటే డైరెక్టర్లకు ఈయన కాల్ షీట్స్ ఇవ్వడం కుదరలేదు కానీ ఒకప్పుడు మాత్రం అడిగిన దర్శకులందరికీ కూడా ప్రభాస్ తన కాల్ షీట్స్ ఇచ్చేవారు.

ఇలా ఒకప్పుడు అందరి దర్శకులకు తన కాల్ షీట్స్ ఇచ్చిన ప్రభాస్ ఒక డైరెక్టర్ మాత్రం తన సినిమా కథను 75 సార్లు ప్రభాస్ కి వివరించినప్పటికీ కూడా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం మాత్రం రాలేకుండా పోయిందని తెలిపారు. కొందరి కారణంగానే తనకు ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ రాలేదంటూ తాజాగా డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ… నేను డార్లింగ్ తో సినిమా చేయాలని అనుకున్నాను అందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నానని తెలిపారు.. ఇలా ప్రభాస్ తో సినిమా చేయటం కోసం ఆ సినిమా కథను ప్రభాస్ కి ఏకంగా 75 సార్లు వినిపించాను. ప్రభాస్ కూడా ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నారు కానీ వైవిఎస్ చౌదరి సినిమాతో ప్రభాస్ బిజీ కావడంతో నాకు డేట్స్ దొరకలేదని తెలిపారు అలా ప్రభాస్ చేయాలనుకున్న సినిమాని చేయలేకపోయానని వెల్లడించారు.

కేవలం ప్రభాస్ తో మాత్రమే కాకుండా వెంకటేష్ తో కూడా తాను ఓ సినిమా చేయాలని భావించాను అది కూడా మిస్ అయిందని తెలిపారు. ఇలా ప్రభాస్ తో సినిమా చేయాలనే కోరిక అలాగే మిగిలిపోయిందని ఈయన తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.