Dil Raju Biopic: సినిమాగా నిర్మాత దిల్ రాజు బయోపిక్.. హీరోగా అతనే సూట్ అవుతారా?

Dil Raju Biopic: సినీ ఇండస్ట్రీలో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ బ్యానర్ సమస్థను స్థాపించి నిర్మాతగా దిల్ రాజు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. దిల్ అనే సినిమా ద్వారా నిర్మాతగా మారారు. అప్పటివరకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్న దిల్ రాజు దిల్ సినిమాతో నిర్మాతగా మారి మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఇక ఈ నిర్మాణ సంస్థలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక త్వరలోనే హీరో నితిన్ నటించిన తమ్ముడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా జులై 4వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దిల్ రాజు ఇటీవల హీరో నితిన్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ క్రమంలోనే హీరో నితిన్ దిల్ రాజును ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఆయన నుంచి సమాధానాలను రాబట్టారు.

అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు హీరోల బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దిల్ రాజు బయోపిక్ సినిమా గురించి నితిన్ ప్రశ్నించారు. ఒకవేళ మీ జీవితం గురించి బయోపిక్ తీసే అవకాశం ఉందా అంటూ ప్రశ్నించారు? ఈ ప్రశ్నకు దిల్ రాజు సమాధానం చెబుతూ ఎందుకు లేదు. నేను గత పాతిక సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. ఈ విషయాల ఆధారంగా సినిమా చేయొచ్చని తెలిపారు.

ఒకవేళ మీ బయోపిక్ సినిమా చేస్తే ఏ హీరో అయితే సరిపోతారని మీరు భావిస్తున్నారు అంటూ మరో ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు దిల్ రాజు సమాధానం చెబుతూ చాలామంది హీరో నితిన్ మీకు తమ్ముడిలాగే ఉంటారని నాతో చెప్పారు కాబట్టి నువ్వే నా బయోపిక్ సినిమాలో చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంటూ దిల్ రాజు చెప్పడంతో నితిన్ ఒక్కసారిగా షాక్ అవ్వుతూ చిన్న స్మైల్ ఇచ్చారు. దిల్ రాజు వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా తన బయోపిక్ సినిమా చేస్తారని స్పష్టమవుతుంది.