ఇండస్ట్రీ టాక్ : తన డైరెక్టర్ పై దిల్ రాజు ఆగ్రహం?అసలు నిజం ఇదే.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఎక్కువ విజయాలు ఉన్న సక్సెస్ ఫుల్ నిర్మాతలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా ప్లాన్డ్ గా దిల్ రాజు సినిమాలు నిర్మాతగా చేయడం కానీ డిస్ట్రిబ్యూటర్ గా తీసుకోవడం కానీ చేస్తూ ఉంటాడు. మరి అలాగే ఈసారి తన సినిమాలు పకట్బందీ గా ప్లాన్ చేస్తున్నాడు.

అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ అలాగే ఇంకో పక్క తమ బ్యానర్ లో 50వ సినిమాగా దర్శకుడు శంకర్ మరియు రామ్ చరణ్ లతో భారీ సినిమాలు చేస్తున్నాడు. మరి ఇదంతా బాగానే ఉంది కానీ దిల్ రాజు మాత్రం ఎక్కువగా విజయ్ సినిమా పైనే దృష్టి పెట్టడం ఎందుకో ఆసక్తిగా మారింది.

మరి ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి తమిళ్ లో “వరిసు” తెలుగులో “వారసుడు” అని తెరకెక్కిస్తున్నారు. దీనిపై మంచి హైప్ కూడా ఉంది. పైగా తమిళ్ లో ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యగా ఈ విషయంలో దిల్ రాజు వంశీ పై ఆగ్రహంగా ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ టాక్.

వంశీ తమిళ మీడియాతో మాట్లాడుతూ వరిసు చిత్రం తమిళ్ లోనే తీస్తున్నామని ఇదొక ప్రాపర్ తమిళ్ సినిమా అంటూ కామెంట్స్ చెయ్యడం దిల్ రాజుకి నచ్చలేదట. మొదట్లో దీనిని బై లాంగువల్ సినిమాగా ప్లాన్ చేస్తున్నామని చెప్పాం అని కానీ వంశీ ఇప్పుడు ఇలా చెప్పడం బాగోలేదని అందుకే కోప్పడ్డాడని అన్నాడట.

అయితే దీనిపై క్లారిటీ తెలుస్తుంది. గతంలో టాలీవుడ్ లో సినిమాల షూటింగ్స్ ఆపినప్పుడు దిల్ రాజే ఇది తమిళ్ సినిమా అని చెప్పి షూటింగ్ చేసాడు అలాంటప్పుడు డైరెక్టర్ చెప్పడం మళ్ళీ తాను కోప్పడ్డాడు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు.