హరీష్ రావు ను ప్లాన్ ప్రకారమే బలి పశువును చేశారా ..? తెలంగాణలో జోరందుకున్న పాలిటిక్స్

harish rao

 దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ ఓడిపోవటంతో ఆ ఓటమి బాధ్యత తనదే అంటూ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు. అయితే దుబ్బాకలో తెరాస పార్టీ ఓడిపోతుందని ముందే తెరాస అధినాయకత్వానికి తెలుసా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై బీజేపీ నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాకలో ఓడిపోతామని సీఎం కేసీఆర్ కు తెలుసు అని తెలిసీ కూడా కావాలనే హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించారని తెలిపారు.

harish rao

 ఉప ఎన్నిక పేరు చెప్పి బలి చేద్దామని అనుకొన్నారని జితేందర్ రెడ్డి అన్నారు. ఇవేమీ తెలియని హరీశ్ రావు ఉప ఎన్నిక ప్రచారంలో మునిగిపోయారని తెలిపారు. కానీ ఓడిపోవడంతో అందరూ హరీశ్ రావు పేరును ప్రస్తావిస్తున్నారని గుర్తుచేశారు. ఒక్క జితేందర్ మాత్రమే కాదు తెరాస పార్టీలో కూడా ఒక వర్గం లో ఇదే వాదన సాగుతున్నట్లు తెలుస్తుంది. పార్టీ లో కేటీఆర్ వర్గం హరీష్ రావు వర్గం అంటూ రెండు వర్గాలు ఉన్నాయని, ఒకరికి వ్యతిరేకంగా మరొక వర్గం వ్యూహాలు రచిస్తారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

ఒక దశలో దుబ్బాకలో తెరాస విజయం సాధిస్తే ఆ క్రెడిట్ మొత్తం హరీష్ రావు ఖాతాలో వెళ్తుంది కాబట్టి, సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ ఎవరో ఒకరు అక్కడ ఎన్నికల ప్రచారం చేయాలనీ తెరాస లోని ఒక వర్గం గట్టిగా పట్టు పట్టిందని, కానీ అందుకు కేటీఆర్ ససేమిరా అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దుబ్బాకలో ఓటమి ఖాయమని తెలిసింది కాబట్టే కేటీఆర్ అటు వైపు చూడలేదనే బొగుట్టు. గతంలోనే తెరాస నుండి హరీష్ రావు బయటకు వెళ్లబోతున్నాడు అనే ప్రచారం సాగింది,. అయితే హరీష్ రావు తాను ఎప్పటికి తెరాస కార్యకర్తనే అని ప్రాణం ఉన్నత వరకు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పటంతో ఆ వివాదం సద్దుమణిగింది.

 ఇప్పుడు మరోసారి దుబ్బాక ఎన్నికల సందర్భంగా తెర మీదకు వచ్చింది. సీఎం కేసీఆర్ కు హరీష్ రావు కు మధ్య విభేదాలు తీసుకొచ్చి, ఆ తర్వాత హరీష్ రావును బీజేపీ లోకి లాగాలనే ఆలోచనలో ఉన్న బీజేపీ పార్టీ కావాలనే ఇలాంటి ప్రచారాన్ని చేస్తుందని కూడా తెరాస లోని కొందరు నేతలు చెపుతున్న మాటలు. మరి ఈ ఎపిసోడ్ లో అసలు నిజానిజాలు ఏమిటో హరీష్ రావు నోరు విప్పితే కానీ తెలియవు, అప్పటిదాకా ఎవరి కోణంలో వాళ్ళు విశ్లేషణలు చేసుకోవటమే తప్ప వాస్తవాలు బయటకురావు