సంపదకు ప్రతిరూపమైన లక్ష్మీదేవి ఫోటోని మన ఇంట్లో పెట్టుకోవడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వివిధ రూపాలలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోలను ఇంట్లో పెట్టుకుని ప్రతి రోజూ పూజలు చేస్తూ ఉంటాము. అయితే అన్ని రకాల లక్ష్మీ దేవి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. కొన్ని రకాల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ శుభం కలుగుతుంది. మరి ఏ విధమైనటువంటి లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉండకూడదు అనే విషయానికి వస్తే…
లక్ష్మీ దేవత గుడ్లగూబ పై కూర్చొని ఉన్నటువంటి ఫోటోని పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకుని పూజ చేయకూడదు. ఇలాంటి ఫోటో ఇంటిలో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి పరిస్థితులు తలెత్తుతాయి.అందుకే ఎప్పుడూ కూడా లక్ష్మీదేవికి గుడ్లగూబ కూర్చొని ఉన్న ఫోటోలు పెట్టకూడదు ఒకవేళ ఇంట్లో అలాంటి ఫోటో ఉంటే వెంటనే తీసేయడం మంచిది.
ఇంటిలో పాము పై విష్ణుమూర్తి సేదతీరుతూ ఉండగా లక్ష్మీదేవి పాదాల చెంత కూర్చుని ఉన్న ఫోటోలు పెట్టుకోవడం ఎంతో శుభప్రదం.ఇలాంటి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తీరే పోవడమే కాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది.అలాగే లక్ష్మీ దేవత తామరపువ్వు పై నిలబడి ఉండడం లేదా కూర్చుని ఉన్నటువంటి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం ఎంతో మంచిది. అలాగే లక్ష్మీదేవి పక్కన ఏనుగులు చిత్రపటం ఫోటో కూడా ఎంతో శుభప్రదం. ఇలాంటి ఫోటోలను పూజించడంవల్ల సకల సంపదలు కలుగుతాయి.